ఏపీలో రైతుల ఆత్మహత్యలు.. ఆ పత్రిక కథనంలో నిజమెంత..?

Chakravarthi Kalyan
ఏపీలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వార్త చర్చకు దారి తీసింది. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఓ పత్రిక  కథనం రాసింది.  గత ఏడాది కన్నా ఈఏడాది బలవన్మరణాలు పెరిగాయని ఆ పత్రిక రాసింది. అయితే ఈ పత్రిక కథనాన్ని మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు. జగన్ సర్కారు రైతు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసి పరిపాలిస్తానని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏదైతే చెప్పారో,  అలాగే పాలిస్తున్నారని కన్నబాబు అంటున్నారు.

జగన్ రైతుల కోసం చెప్పిన హామీలే కాకుండా చెప్పని పథకాలు కూడా రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్నారన్న కన్నబాబు... వైయస్ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్‌ మొదలుకొని, వైయస్ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం, వైయస్ఆర్ వడ్డీలేని రుణాలు, వైయస్ఆర్‌ జలకళ వరకూ అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే తొలి కేబినెట్‌ లోనే.. ఎవరైనా రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల వద్ద అత్యవసర నిధి కోసం కోటి రూపాయలు జమ చేశామని చెప్పారు. వ్యవసాయ సంబంధ కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి సాయం అందించాలని జ‌గ‌న్‌ చెప్పారని.. అందుకు సంబంధించిన డేటాను పరిశీలించి, 450 కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇచ్చామని మంత్రి అంటున్నారు. అంటే ఏపీలో గతేడాది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు 450 మందేనని మంత్రి చెబుతున్నారు.

అయితే.. సదరు పత్రిక ఎన్‌సీఆర్బీ ఇచ్చిన డేటా ప్రకారమంటూ 2020లో ఏపీలో 889మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాసింది. అయితే.. ఎన్‌సీఆర్బీ ఇచ్చిన నివేదికలో ‘రైతులు, రైతు కూలీలుగా వర్గీకరించి, ఆ కేటగిరిలో, ఆవృతిలో ఉన్న ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న వివరాలు ఇస్తారు తప్ప.. వారి మరణాలకు గల కారణాలను పేర్కొనరని మంత్రి వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: