వామ్మో ఇదేమి చిత్రం.. ఆ పని చేసి వరల్డ్ రికార్డు కొట్టాడు?

praveen
ప్రపంచ రికార్డు సాధించాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతూ ఉంటారు.. కానీ ఆశ పడినంత  తేలిక కాదు కదా ప్రపంచ రికార్డు సాధించడం అంటే. ప్రపంచంలో ఉన్న అందరితో పోల్చి చూస్తే ఎవరికి లేని ప్రత్యేకమైన టాలెంట్ ఉంటేనే ఇక ప్రపంచ రికార్డు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇలా ప్రత్యేకమైన టాలెంట్ కలిగి ఉన్న ఎంతోమంది ఇప్పటివరకూ రికార్డు సాధించిన సత్తా చాటారు. ఇలా ప్రపంచ రికార్డు సాధించడానికి ఎంతో మంది వినూత్న ప్రయోగాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.

 అయితే ఇలా ప్రపంచ రికార్డు సాధించడానికి కొంతమంది చేసే ప్రయత్నాలు చూస్తూంటే ఏకంగా ప్రపంచమే ఆశ్చర్య పోతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి చిత్రమైన పని చేసి ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టేశాడు. ఇంతకీ అతను ఏం చేసి ప్రపంచ రికార్డు కొట్టాడు అని అనుకుంటున్నారు కదా.. పెద్దగా ఏమీ కష్టపడలేదు కేవలం కళ్ళు ఆర్పకుండా చూసి ప్రపంచ రికార్డు కొట్టేశాడు. ఓస్ అంతేనా.. అలా అయితే మేము కూడా ప్రపంచ రికార్డు కొట్టేస్తాం అనే ఆలోచన ఆమె మదిలో మెదిలే ఉంటుంది.. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అలా మీకు మీరు ఫిక్స్ అయ్యారు అంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది సుమీ. ఎందుకంటే అతను కళ్లార్పకుండా చూసింది ఒక నిమిషం రెండు నిమిషాలు కాదండోయ్.

 ఎవరికీ సాధ్యం కాని రీతిలో కళ్ళార్పకుండా చూసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. సాధారణంగానే అందమైన అమ్మాయి కనిపిస్తే  కన్నార్పకుండా చూస్తూ ఉంటారు  ఇక సాధారణంగా అయితే నిముషానికి 15 నుంచి 20 సార్లు  మనకు తెలియకుండానే కళ్ళు ఆర్పడం జరుగుతూ ఉంటుంది  కానీ ఫిలిప్పీన్స్ యాక్టర్ ఫాలో బెల్లస్ట్ రోస్ ఏకంగా ఒక గంట 17 నిమిషాల పాటు కళ్లార్పకుండా చూసి ప్రపంచ రికార్డును కొట్టేశాడు. ప్రస్తుతం కమెడియన్గా టీవీ హోస్టుగా ఉన్న సదరు వ్యక్తి ఏకంగా నో డ్రింకింగ్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఒక బ్లింకింగ్ ఛాలెంజ్ లో పాల్గొని  పదిహేను నిమిషాలపాటు కళ్లార్పకుండా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: