ఏపీ ప్రభుత్వం ఆ కేంద్ర మంత్రి కనుసన్నల్లో, టీడీపీ కేంద్రానికి దాసోహం...?

Sahithya
గత కొన్ని రోజులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేస్తున్నారు. అలాగే ఏపీ సిఎం వైఎస్ జగన్ తో పాటుగా పలు టీవీ కార్యక్రమాల మీద కూడా ఆయన విమర్శలు చేయడం చూస్తున్నాం. ఇప్పుడు సుప్రీం కోర్ట్ పెగాసిస్ పై తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రానికి చెంప పెట్టు లాంటిదన్న నారాయణ... ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అమిత్ షా కనుసన్నల్లో నడుస్తుంది అంటూ వ్యాఖ్యలు చేసారు.
 సుప్రీం ధర్మాసనం నియమించిన జస్టిస్ రవీంద్ర కమిటీని స్వాగతిస్తున్నాం అని అన్నారు నారాయణ. పెగాసిస్ పై ప్రధాని మోదీ ఇప్పటికైనా స్పందించాలి అని ఆయన డిమాండ్ చేసారు.  విదేశాలను నుంచి హెరాయిన్ గుజరాత్ ముంద్రా పోర్టుకు ఎలా చేరిందో చెప్పాలి అని డిమాండ్ చేసారు. ముంద్రా పోర్టు ప్రధాని శిష్యుడు ఆదాని ఆధ్వర్యంలో నడుస్తుంది అని విమర్శలు చేసారు. ముంద్రా పోర్టు నుంచే హెరాయిన్ విజయవాడకు చేరింది అని ఆయన వివరించారు. అదానీని కాపాడేందుకే షారుఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేశారు అని ఆయన విమర్శలు చేసారు.
ఏపీ నుంచి తెలంగాణకు గంజాయి సరఫరా అవుతుంటే కేసీఆర్.. జగన్ ను ఎందుకు ప్రశ్నించడం లేదు అని ఆయన నిలదీశారు. దేశంలో పార్లమెంట్ వ్యవస్థకే ప్రమాదం ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేసారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్,  వైసీపీ, టీడీపీ ప్రశ్నించటం లేదు అని నిలదీశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ...ఇది అప్రజాస్వామ్యం అని అన్నారు ఆయన. అందమైన కాళేశ్వరం నిర్మాణంలో అంతులేని అవినీతి ఉంది అని  ఆయన వ్యాఖ్యలు చేసారు. కాళేశ్వరం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు తప్పితే మరెక్కడికి నీళ్లు పోవడం లేదు అంటూ విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cpi

సంబంధిత వార్తలు: