బద్వేలు : పవనోరు కనీసం ప్రశ్నించలేదేం.. ?

VUYYURU SUBHASH
బ‌ద్వేల్ ఉప ఎన్నిక ప్ర‌చారం ఈ రోజు సాయంత్రంతో ముగుస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ అస‌లు పోటీ చేయ‌డం లేదు. దీంతో బ‌ద్వేల్ ఉప ఎన్నిక చ‌ప్ప‌గా ఉంది. బ‌ద్వేల్లో టీడీపీ పోటీలో ఉంటే గెలుపు ఓట‌మి సంగ‌తి ఎలా ?  ఉన్నా ఆ పార్టీకి అక్క‌డ గ‌ట్టి కేడ‌ర్ ఉంది. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. బ‌ద్వేల్లో టీడీపీకి గెలుపు ఓట‌ముల‌తో సంబంధం లేకుండా 50 వేల ఓటు బ్యాంకు ఉంది. ఏదో సంప్ర‌దాయం పేరుతో చంద్ర‌బాబు అక్క‌డ త‌మ పార్టీ క్యాండెట్ ను పోటీకి పెట్ట‌లేదు.
ఇక చంద్ర‌బాబు ఆడిన ఆట‌, పాట‌ల‌నే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఇక్క‌డ రిపీట్ చేశారు. ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టి ఏడేళ్లు అవుతున్నా ప‌వ‌న్ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో మాత్ర‌మే పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తు గా ఓడిపోవ‌డంతో పాటు ఆయ‌న ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు. పైగా ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబుకు ఎంపీ సీటు ఇస్తే ఆయ‌న కూడా ఓడిపోయారు. పైగా ఓ చోట ప‌వ‌న్‌.. ఇక ఎంపీగా పోటీ చేసిన నాగ‌బాబు ఇద్ద‌రూ కూడా మూడో స్థానంతో స‌రి పెట్టుకున్నారు.
ఇక ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన చాలా చోట్ల టీడీపీతో లింకు పెట్టుకుని కొన్ని విజ‌యాలు సాధించింది. దీంతో ఆ పార్టీ వాళ్లు రెచ్చిపోయారు. అలాంటిది ఇప్పుడు జ‌న‌సేన బ‌ద్వేల్లో పోటీ చేసి స‌త్తా చాటి ఉంటే అప్పుడు ప‌వ‌న్ ద‌మ్మేంటో తెలిసేది. బీజేపీ అక్క‌డ పోటీ చేస్తోంది.. ఓడిపోయినా తాము మెరుగు అయిన రేంజ్‌లో ఓట్లు సాధిస్తామ‌ని ధీమాగా ఉంది. ప‌వ‌న్‌కు క‌నీసం ఆ ధీమా కూడా లేక‌పోవ‌డంతోనే అడ్ర‌స్ లేకుండా పోయార‌ని సెటైర్లు ప‌డుతున్నాయి. పైగా ఇక్క‌డ బ‌లిజ వ‌ర్గం ఓట‌ర్లే ఎక్కువ‌. ప‌వ‌న్ అభిమానులు కూడా ఎక్కువే. అన్ని సానుకూల‌త‌లు ఉండి కూడా ప‌వ‌న్ తోక ముడిచేసిన వాతావ‌ర‌ణ‌మే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: