బద్వేలు: క్లైమాక్స్ ట్విస్టులు ఇలా ఉన్నాయా...!

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని బ‌ద్వేలు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక ప్ర‌చారం ఈ రోజుతో ముగుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7 గంట‌ల‌ నుంచి మైకులు మూగ‌బో నున్నాయి. ఇప్ప‌టికే అధికార పార్టీ అట్ట‌హాస ప్ర‌చారంతో బ‌ద్వేల్ హోరెత్తింది. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ పోటీలో లేక‌పోవ‌డంతో అధికార వైసీపీకి గెలుపు ఏక‌ప‌క్షం కానుంది. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సామాజిక వ‌ర్గం అయిన బ‌లిజ వ‌ర్గం ఓట‌ర్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. అయితే జ‌న‌సేన కూడా పోటీ లో లేక‌పోవ‌డంతో ఇక వైసీపీ గెలుపు క‌న్నా .. ఆ పార్టీకి వ‌చ్చే మెజార్టీ మీదే ఎక్కువుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

అయితే జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బీజేపీ బ‌ద్వేలు ఉప ఎన్నిక బ‌రిలో ఉండ‌డంతో ఆ పార్టీల‌కు ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌న్న‌ది మాత్ర‌మే చూడాల్సి ఉంది. ఇక్క‌డ అధికార వైసీపీ పై వైసిపి, బిజేపిల విమర్శలు... అరోపణలతో అంతకంతకూ పెరిగిన రాజకీయ వేడి పెరిగింద‌నే చెప్పాలి. బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం లోని పల్లెల్లో తిష్టవేసిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తిష్ట‌వేశారు.

ఇక అధికార వైసిపి నుంచి ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలకు ముఖ్య‌మంత్రి బాధ్యతలు అప్ప‌గించారు. ఏపీ బిజేపి ఛీఫ్ సొమువీర్రాజు బద్వేలులోనే తిష్టవేసి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే బద్వేలులో జరిగిన అభివృద్ది తమదేనంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. పైగా కాంగ్రెస్ ఇక్క‌డ నుంచి 2009లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే క‌మల‌మ్మ‌ను పోటీకి దింపింది. మ‌రి ఈ ట్ర‌యాంగిల్ పోరులో గెలుపు వైసీపీ దే అని తేలిపోయినా బీజేపీ, కాంగ్రెస్ ల‌లో ఎవ‌రికి డిపాజిట్ వ‌స్తుంది ? ఎవ‌రిది సెకండ్ ప్లేస్ అన్న‌ది మాత్ర‌మూ ఇక్క‌డ చూడాల్సిన విష‌యం. అంత‌కు మించి ఇక్క‌డ కొత్త గా ఎవ్వ‌రికి ఒరిగేది అయితే ఉండ‌ద నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: