ధర్మానకు టఫ్ ఫైట్ తప్పేలా లేదుగా!

M N Amaleswara rao
ఏపీలో సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్ కూడా ఒకరని చెప్పొచ్చు. ఎందుకంటే ధర్మాన మొదట నుంచి వైసీపీ ఫ్యామిలీకి వీరవిధేయుడు. ఎందుకంటే వైఎస్సార్ అండతోనే ధర్మాన కృష్ణదాస్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అలాగే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నర్ససన్నపేట నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కూడా కృష్ణదాస్ సత్తా చాటారు.


అయితే వైఎస్సార్ చనిపోవడం, జగన్ వైసీపీ పెట్టడంతో కృష్ణదాస్ మరొక ఆలోచన లేకుండా జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2012 ఉపఎన్నికలో వైసీపీ తరుపున నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓటమి పాలైన కృష్ణదాస్...2019 ఎన్నికల్లో మరొకసారి మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.


ఇక ముందు నుంచి జగన్‌కు అండగా ఉండటంతో కృష్ణదాస్‌కు మంత్రి పదవి కూడా దక్కింది. అలాగే డిప్యూటీ సీఎం హోదా కూడా వచ్చింది. ఇప్పుడు మంత్రిగా ఉన్న కృష్ణదాస్ తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే మంత్రిగా అనుకున్న మేర కృష్ణదాస్ సక్సెస్ కాలేదనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే పలు సర్వేల్లో కూడా మంత్రిగా కృష్ణదాస్‌కు మంచి మార్కులు పడటం లేదని తేలింది. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎలాగో కృష్ణదాస్ మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సింది.
అయితే మంత్రిగా తప్పుగా ఉంటే కృష్ణదాస్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వాలి. మరి ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి అండగా ఉండటం బట్టి, నెక్స్ట్ ఎన్నికల్లో కృష్ణదాస్ గెలుపు ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే నరసన్నపేటలో కృష్ణదాస్ బలం తగ్గలేదు. కానీ రాబోయే రెండున్నర ఏళ్ళు కూడా బాగా కష్టపడితే కృష్ణదాస్ మరొకసారి సత్తా చాటవచ్చు. కాకపోతే మునుపటిలా కృష్ణదాస్ సులువుగా గెలవడం కష్టమని తెలుస్తోంది. ఈసారి టీడీపీ నుంచి కృష్ణదాస్ టఫ్ ఫైట్ ఎదురుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: