రేవంత్‌కు అంత భయం ఎందుకు...?

VUYYURU SUBHASH
తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే వ‌ర‌కు ఎంత టెన్ష‌న్ అనుభ‌వించాడో కాని ఇప్పుడు అంత‌కు మించిన టెన్ష‌న్ అనుభ‌విస్తున్నాడు. రేవంత్ పీసీసీ ప‌గ్గాలు సొంతం చేసుకునేందుకు పార్టీలో ఉద్దండులు అయిన సీనియర్ల‌తో పెద్ద పోరాట‌మే చేశాడు. రేవంత్ కు ఎలాగైనా పీసీసీ ప‌గ్గాలు ద‌క్క‌కుండా చేసేందుకు సీనియ‌ర్లు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఓ వైపు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌రో వైపు కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి మ‌రో వైపు జానా రెడ్డి తో మొద‌లు పెడితే ఇలా చాలా మంది నేత‌లు రేవంత్ ను టార్గెట్ గా చేసుకుని ఆయ‌న‌కు పీసీసీ రాకుండా చేసేందుకు వేయ‌ని ఎత్త‌లు లేవు.

ఎలాగోలా రాహుల్ గాంధీ ప్రాప‌కంతో రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు అయ్యాడు. అయితే ఆ య‌న‌కు అస‌లు సిస‌లు ముస‌ళ్ల పండ‌గ స్టార్ట్ అయ్యింది. రేవంత్ కు ప‌ద‌వి వ‌చ్చినా సీనియ‌ర్ల నుంచి ఏ మాత్రం స‌హ‌కారం లేదు. ముఖ్యంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌లు అంద‌రూ రేవంత్ ను టార్గెట్‌గా చేసుకుని పార్టీలో అనే క కుంప‌ట్లు రాజేస్తున్నారు.

కోమ‌టి రెడ్డి వెంక‌ట రెడ్డి తో పాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నుంచి రేవంత్‌కు ఇప్ప‌ట‌కీ స‌రైన స‌హ‌కారం ఉండ‌డం లేదు. రేవంత్ ను అణ‌గ‌దొక్కేందుకు తెర వెన‌క చేయాల్సిన ప్ర‌య‌త్నాలు అన్నీ చేస్తున్నారు. మ‌రోవైపు రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బ‌లోపేతానికి పాద‌యాత్ర చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. అయితే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ల తో పాటు ఉత్త‌ర తెలంగాణ నేత‌ల నుంచి స‌హ‌కారం లేక‌పోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త మ‌వుతున్నాడు.

మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ విబేధాల‌ను అధికార టీఆర్ ఎస్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచు కునేందుకు కాచుకుని ఉంది. ఇలాంటి టైంలో సీనియ‌ర్ల స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో రేవంత్ ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త మువుతోన్న ప‌రిస్థితి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: