జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పులివెందుల అసెంబ్లీ బ‌రిలో వైఎస్‌. భార‌తి...?

VUYYURU SUBHASH
వ‌రుస సంచ‌ల‌నాల తో ఏపీ పాల‌న‌ను హీటెక్కిస్తోన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతోన్న ప‌రిస్థితి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న పులివెందుల‌, క‌డ‌ప పార్ల‌మెంటునే త‌న అడ్డాగా చేసుకుని రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ దృష్టి ఈ సారి ఉత్త‌రాంధ్ర మీద ప‌డింద‌ని అంటున్నారు. జ‌గ‌న్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా క‌డ‌ప పార్ల‌మెంటు లేదా పులివెందుల అసెంబ్లీ గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రాలేదు. అయితే 2014 ఎన్నిక ల‌లో మాత్రం తొలిసారిగా జ‌గ‌న్ త‌ల్లి వైఎస్‌. విజ‌య‌ల‌క్ష్మి ని వైజాగ్ ఎంపీ గా పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నిక‌ల‌లో విజ‌య ల‌క్ష్మి  నాడు బీజేపీ నుంచి పోటీ చేసిన కంభంపాటి హ‌రిబాబు చేతిలో ఏకంగా 90 వేల ఓట్ల తేడా తో ఘోరంగా ఓడిపోయారు.
ఆ త‌ర్వాత ష‌ర్మిల కూడా 2014లో ఖ‌మ్మం నుంచి పోటీ చేస్తార‌ని.. ఇక గ‌త ఎన్నిక‌ల‌లో ఒంగోలు నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగినా ఆమె పోటీ చేయ‌లేదు. ఇక మొన్న ఎన్నిక ల‌లో అప్ర‌తిహ‌త విజ‌యం సాధించిన జ‌గ‌న్ 2024 ఎన్నిక‌ల‌లో వ‌రుస‌గా రెండోసారి గెలిచి విపక్ష టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉన్నార‌న్న‌ది వాస్త‌వం.
అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ముందుగా పులి వెందుల తో పాటు ఉత్త‌రాంధ్ర‌లో మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత పులివెందుల‌కు రాజీనామా చేసి .. అక్క‌డ నుంచి ఉప ఎన్నిక‌ల‌లో త‌న భార్య వైఎస్‌. భార‌తిని పోటీ చేయిస్తార‌ని టాక్ ?  లేని ప‌క్షంలో నేరుగా జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర నుంచే పోటీ చేసి..  పులివెందుల నుంచి భార‌తి ని బ‌రిలోకి దింపుతార‌ని కూడా తెలుస్తోంది. ఏదేమైనా  ఈ ప‌రిణామాలు చూస్తుంటే జ‌గ‌న్ ఈ సారి త‌న భార్య భార‌తి ని కూడా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో కి ఎంట్రీ చేయించేందుకు రెడీ అవుతున్న‌ట్టే తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: