రేసులోకి మధుసూదన్...జగన్ ఆఫర్ ఎవరికో?

M N Amaleswara rao
ఏపీ మంత్రివర్గంలో అనేక ట్విస్ట్‌లు వచ్చేలా ఉన్నాయి....మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే 100 శాతం మంత్రివర్గంలో మార్పులు ఖాయమని చెప్పేశారో అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. ఒక్కసారిగా ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. ఒక్కసారి మంత్రి అని పిలిపించుకోవాలని చాలామంది ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ ఆశావాహుల లిస్ట్ పెరిగిపోతుంది. అసలు జగన్ ఎవరిని మంత్రివర్గంలో తీసుకుంటారా? అనే ఉత్కంఠత పెరిగిపోతుంది.
ఇదే క్రమంలో చిత్తూరు జిల్లాలో నెక్స్ట్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవడానికి పలువురు ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి క్యాబినెట్‌లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు ఉన్నారు. వీరు సైడ్ అయితే....వారి ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేయాలని పలువురు చూస్తున్నారు. అయితే రెడ్డి, ఎస్సీ కోటాలో పదవులు ఫిల్ అయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే ఒకే జిల్లాలో ఇద్దరు రెడ్లకు మంత్రి పదవులు ఇవ్వడం కష్టం.
ఇప్పటికే రెడ్ల కోటాలో పదవి దక్కించుకోవడానికి పలువురు ఆశావాహులు రెడీగా ఉన్నారు. మొదట నుంచి పదవి ఆశిస్తున్న వారిలో రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ఉన్నారు. రోజా అయితే మొదట విడతలోనే పదవి వస్తుందని ఆశించారు. కానీ అప్పుడు కుదరలేదు. మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏపిత‌ఐ‌ఐసిా ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఈ మధ్య ఆ పదవి కూడా తీసేశారు. దీంతో రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అని ఆమె వర్గం ప్రచారం చేసుకుంటుంది. ఇటు చెవిరెడ్డి, భూమనలు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు.
అయితే ఈ రేసులోకి బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా వచ్చారు. అసలు జగన్ భక్తుడుగా ఉన్న బియ్యపు సైతం పదవి ఆశిస్తున్నారు. అటు సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి కూడా ఒక్క ఛాన్స్ అంటున్నారు. ఇంతమంది రెడ్డి ఎమ్మెల్యేల్లో ఒక్కరికే ఛాన్స్ దక్కనుంది. అటు బి‌సి కోటాలో వెంకట గౌడకు అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాలో పోటీ ఎక్కువగానే ఉంది. మరి జగన్ ఎవరిని క్యాబినెట్‌లోకి తీసుకుంటారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: