రేవంత్ ఆయన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు...?

Gullapally Rajesh
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గా మారిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆయన వైఖరి నచ్చక ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావన కొంతవరకు వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీని వెనక్కు లాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
 అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల్లో సీనియర్ నేతలకు భాగస్వామ్యం లేకపోవడం పార్టీని మరింత ఇబ్బంది పెడుతుంది అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ముందు నుంచి కీలక పాత్ర పోషించిన నాయకులను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని ముఖ్యంగా జానారెడ్డి విషయంలో ఆయన ఇబ్బందిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై ప్రకటించారు. ఆయన సలహాలు సూచనలు తీసుకునే విషయంలో మాత్రం రేవంత్ ముందుకు రావడం లేదని అంటున్నారు.
 వాస్తవానికి జానారెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటమే కాకుండా తెలంగాణ రాజకీయాల మీద పూర్తి పట్టు ఉంది. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి విధేయుడు కాబట్టి ఆయన సలహాలు తీసుకుంటే బాగుంటుంది అని కొంతమంది నేతలు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఉన్న సమయంలో జానారెడ్డితో ఎప్పటికప్పుడు మాట్లాడి సలహాలు తీసుకునే వారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ విధంగా వ్యవహరించడం లేదని జానా రెడ్డి కుమారులను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మార్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయలేకపోతున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: