జగన్ తొలి రెండుప్రకటనల ఫలితం ఏలా ఉంది ?

జగన్  తొలి  రెండుప్రకటనల  ఫలితం ఏలా ఉంది ?


ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు దాటి పోయాయి. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన  రెండు కీలక ప్రకటనలు చేశారు.  ఒకటి రాష్ట్రానికి సంబంధించినది, మరోకటి కేంద్రానికి సంబంధించినది.
 మంత్ర వర్గ సహచరుల విషయంలో ప్రకటన  సోంత పార్టీని ఉద్దేశించినది.  మంత్రులవుతున్న వారు మంత్రులుగా ఉంటారని, మిగిలిన ఎం.ఎల్.ఏలు తనతో ఉంటారని జగన్ మోహన్ రెడ్డి  పేర్కోన్నారు. మంత్రుల పదవీ కాలం రెండున్నర సంవత్సరాలేనని, తరువాత కొత్తవారికి అమాత్యపదవి లభిస్తుందని  జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో మంత్రి  పదవి తొలిదశలో దక్కని వారు మలిదశ కూర్పు మీద ఆశలు పెట్టుకున్నారు. అసలు మంత్రి పదవి పై అశలు లేని వారు ఈ  ప్రకటన పై చాలా సంబర పడ్డారు. తాము జగనన్న కోటరీలో ఉంటామని, అనుకున్న పనులన్నీ చేయించుకోవచ్చని  ఆనంద పడ్డారు. కళ్లు  మూసి తెరిచే లోగా రెండు సంవత్సరాలు గడిచి పోయాయి.  సి.ఎం. కోటరీలో ఉంటామని  సంబర పడ్డ ఎం.ఎల్.ఏ లలో చాలా మందికి అసలు ఆయన అపాయింట్ మెంటే దొరక లేదు. లాబీ చేయగల నేేర్పు గలవాళ్లకు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ దొరుకుతుందని చాలా మంది శాసన సభ్యులు  తమ సన్నిహిత సహచరుల వద్ద వాపోతున్నారు.
ఇక ఆయన చేసిన రెండో ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కు సంబంధించినది. ఢిల్లి  వేదికగా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు.  ఈ ప్రకటన రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు దారి తీసింది. ఓ వారం రోజుల పాటు తెలుగు ఛానళ్లు, జాతీయ మీడియా  లో చర్చలకు ఆస్కారం కల్పించింది.  వై.ఎస్.ఆర్  కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తిరిగులేని ఆధిక్యం సాధిస్తే ఆ మెజార్జీ బలంతో కేంద్ర  ప్రభుత్వం మెడలు వంచి  ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా  సాధంచ  వచ్చని తాను భావించినట్లు జగన్  మోహన్ రెడ్డి తెలిపారు. అయితే కేంద్రంలో  అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీకి తమ మద్దతు  అవసరం లేదని చెప్పారు. దీంతో  వై.ఎస్.ఆర్. సి.పి  మద్దతు ఢిల్లీ పెద్దలకు అంతగా  అవసరం లేదని చెప్పారు. అయినా తాను ప్రత్యేక హోదా సాధించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన  చర్చలకు దారి తీసింది.  నాటి ఎన్నికల ఫలితాలతో ఖంగు తిన్న తెలుగు దేశం పార్టీ ఈ ప్రకటన పై ఏ విధంగాను స్పందించ లేదు.  ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఆనాడు ఆ పార్టీ ఉంది. కాలగమనంలో  తెలుగుదేశం పార్టీ కొంత కోలుకున్నా అధికార పక్షాన్ని ప్రతిఘటించే స్థాయికి  చేరుకో లేదు.
జనగ్ మోహన్ రడ్డి పాలనా పగ్గాలు చేపట్టి   రెండు సంవత్స రాలు దాటి పోయిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. అందరిలోనూ తాజాగా ముందస్తు ఎన్నికల గుబులు పుట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: