కాబూల్‌లో ఐఎస్ వర్సెస్ తాలిబాన్..!

Podili Ravindranath
ఆఫ్ఘనిస్థాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబాన్లకు కోపం వచ్చింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లోని ఈద్గా మసీదు వద్ద నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు పది మంది పౌరులు మృతి చెందారు. ఇప్పటికే కావాల్సినంత చెడ్డపేరు మూటగట్టుకున్న తాలిబన్లు ఆత్మహుతి దాడి పై గుర్రుగా ఉన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తామన్న తాలిబన్ల మాటను ప్రస్తుతం ఎవరూ నమ్మడం లేదు. కాబుల్ మసీద్ పేలుడు ప్రపంచం ముందు తాలిబన్లను దోషిగా నిలబెట్టింది. ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి దాడికి ఐఎస్ తీవ్రవాదులే కారణమని గుర్తించిన తాలిబాన్ ఫైటర్స్ రివేంజ్ తీసుకున్నారు. కాబూల్లో ఐఎస్ తీవ్రవాదులకు చెందిన స్థావరాలపై తాలిబన్లు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఐఎస్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున హతమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐసిస్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని ఆశిస్తూ ముందుగానే తాలిబన్ల దాడి చేస్తున్నారు.
తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తల్లి అంత్యక్రియల సమయంలో ఐసిస్ తీవ్రవాదులు ఆత్మహుతి దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాబూల్లోని ఖైబర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఐసిస్ స్థావరంపై దాడి చేసిన తాలిబన్లు కనిపించిన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఆగస్ట్ 26వ తేదీన కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద యూఎస్ దళాలని లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ తీవ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 170 మంది చనిపోయారు. ఆ తర్వాత కూడా పలుమార్లు తాలిబన్ల టార్గెట్ చేస్తూ ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా కాబూల్ ఈద్గా దాడితో ఆఫ్గాన్ లో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. 2018 నుంచి ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సైనిక దళాల దూకుడు తగ్గడంతో... ఐసిస్ ఉగ్రవాదులు వరుస దాడులకు తెగబడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలకు రక్షణ కల్పిస్తామని పాల్గొన్న హామీ ఇచ్చిన ఐసీస్ దాడులు మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: