కాంగ్రెస్ లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసమ్మతేనా..?

MOHAN BABU
సీనియర్ నేతలను కలుపుకొని కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ కి  ఏ ఐసిసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సూచించారు. కమ్యూనికేషన్ అందించే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లదే అని క్లారిటీ ఇచ్చారు. పిసిసి కూడా సమన్వయం చేసుకోవాలని ఏఐసీసి అభిప్రాయపడింది. తెలంగాణ కాంగ్రెస్ లో అధిష్టానం నియమించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొదటిసారి సమావేశం నాలుగున్నర గంటలపాటు జరిగింది. పిఎసి లోకి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి లను కూడా సభ్యులుగా తీసుకోవాలని సూచించారు జగ్గారెడ్డి.

దీనిపై ఏఐసిసి అనుమతి తో సభ్యులను  ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఠాగూర్. ఈ సమావేశానికి సీనియర్ నేతలు అంతా  వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం డుమ్మా కొట్టారు. నాలుగున్నర గంటలపాటు కొనసాగిన పీఏసీ సమావేశంలో పార్టీలో సమన్వయ లోపం, కార్యాచరణ అమలు పైనే ఎక్కువ దృష్టి పెట్టారు సీనియర్ నేతలు. అందర్నీ కలుపుకొని పోవాలని పీసీసీ కి టాగూర్ సూచన ఇచ్చారు. ఏ కార్యాచరణ అయినా పీఏసీ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని విహెచ్ సూచించారు. మీరే నిర్ణయం తీసుకొని పీఏసీ లో చర్చకు పెట్టడం సరికాదన్నారు. జహీరాబాద్ క్రికెట్ మ్యాచ్ ఫైన అభ్యంతరం వ్యక్తం చేశారు మధుయాష్కి. తమకు కూడా సమాచారం ఇవ్వాల్సిందని అజారుద్దీన్ ను అడిగారు యాష్కీ. ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా ఆ ప్రాంత ఇన్చార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు కోఆర్డినేట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది పిఎసి. ఇన్చార్జి టాగూర్ కరీంనగర్ వస్తే తనకు,  జీవన్ రెడ్డి కి సమాచారం కూడా లేదని,  ఇది సరికాదన్నారు మాజీమంత్రి శ్రీధర్ బాబు.

 ఇకపై అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూస్తామని చెప్పారు ఠాగూర్. ఉత్తమ్ కుమార్, జానారెడ్డి లు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ పెట్టారు. అందరు నాయకుల్ని కలుపుకుని పోవాలని, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలని రేవంత్ కు సూచించారు ఠాగూర్. విద్యార్థి, నిరుద్యోగ సమస్యపై డిసెంబర్ 9 వరకు కార్యక్రమాలను వహించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ ఏఐసీసీ బాధ్యతలు చేపట్టాలని పీఎసి తీర్మానం చేసింది. ఈ నెల 27న భారత్ బంద్ విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త, అభిమాని పాల్గొనాలని పిలుపునిచ్చింది పార్టీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: