జనం కోసం పవన్ : అడ్డదారులు నమ్ముకోడు అందుకే?

RATNA KISHORE
అరచేతిలో స్వర్గం చూపించడం వరకూ జనసేన చేయని పని. ముఖ్యంగా కులాల కుంపట్లకు దూరంగా తన పని తాను చేసుకుని పోవడంతో ఇప్పటిదాకా ఏ వివాదాలూ లేవు. మతాలు వాటిని గౌరవించే విధానం ఒక్కటి జనసేన ఎన్నడూ పాటిస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రజలను ప్రేమించే నాయకులకు విలువ ఇవ్వాలని అంటుంది. విలువ ఇస్తుంది కూడా! అనేక హామీలు ఇచ్చి వాటిపై ఎటువంటి స్పష్టత లేకుండా తాత్కాలిక ఆనందాలు పొందడం సబబు కానే కాదు అని చెబుతోంది. బీజేపీతో పొత్తు ఉన్నా ఆ రోజు పదవులు తీసుకోలేదు. తరువాత రాష్ట్రంలోనూ అదే పంధా అనుసరించింది. ఓ దశలో పవన్ ను రాజ్యసభకు పంపాలన్న యోచన ఉందన్న వార్త ఒకటి  టీడీపీ నుంచి వచ్చినా వాటిని కూడా సున్నితంగానే తిరస్కరించింది. నాలుగు ఓట్లు వచ్చినా, రాకున్నా మనం జనం తరఫునే మాట్లాడాలి అని తరుచూ పవన్ చెబుతారు. ఇదే ఎప్పడూ పాటించాలని తన వారికి బోధిస్తారు.
 
రాజకీయం అంటేనే అనేక అడ్డదారులు ఉంటాయి. ఉండాలి కూడా! కొన్ని దారులు సహకరిస్తే కొన్ని చోట్ల అవే నయవంచనకు తా విస్తాయి. కారణం అవుతాయి. ఎన్నో కుయుక్తులు, కుట్రలు దాటాకే రాజకీయం మంచి నుంచి చెడు వైపు లేదా చెడు నుంచి ఇం కాస్త మంచి వైపు సాగించే ప్రయాణం ఒకటి ఉంటుంది. అన్ని పార్టీలకూ ఇదే వర్తిస్తుందని చెప్పలేం. కొన్ని మాత్రం వీటినే నమ్ము కుని జీవితం నెట్టుకువస్తుంటాయి. పత్రికల్లో వార్తల రూపంలో నిలుస్తుంటాయి. పొత్తుల కారణంగా లబ్ధిపొందుతుంటాయి.
వాస్తవానికి ఇంతవరకూ పవన్ కు పొత్తుల కారణంగా కలిసి వచ్చిన కొత్త విషయం ఏమీ లేదు. అందుకే ఆయన టీడీపీ పై కానీ కమ్యూనిస్టులపై కానీ పెద్దగా ఆశలు ఉంచుకోలేదు. టీడీపీ, బీజేపీ కూటమీతో జట్టు కట్టినప్పుడు కూడా పవన్ కీలకంగా వ్యవహరిం చారే తప్ప పదవుల పంపకంలో భాగస్వామ్యం కాలేదు. అదేవిధంగా కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా జనసేన పెద్దగా లాభ పడిం ది లేదు. అయినప్పటికీ ఆ రోజు ఉన్న సమీకరణాల్లో భాగంగా పవన్ తాను టీడీపీతో మరి పనిచేయనని చెప్పి కమ్యూనిస్టులతో జ త కట్టారు. ముఖ్యంగా ఉచిత పథకాలు అనౌన్స్ చేయడంపై పవన్ దృష్టి సారించరు. పథకాలు వాటికి సంబంధించిన తీరు తెన్నుల పై పూర్తి అధ్యయనం తరువాతే మాట్లాడతారు. చాలా పార్టీలు నమ్ముకున్న విధంగా అప్పటికప్పుడు దక్కే ఫలితాలపై ఆయనకు నమ్మకం లేదు. ఆ విధంగా చూస్తే ఇతర పార్టీల కన్నా హామీలు ఇచ్చే విషయంలో జనసేన ఎప్పుడూ వెనుకబడే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: