రాష్ట్రపతి పాలన విధించాలి : టి.డి.పి

 రాష్ట్రపతి పాలన విధించాలి : టి.డి.పి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడింది. జడ్.పి.టి.సి, ఎం.పి.టి.సి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆ పార్టీ అధినేత, నారా చంద్రబాబునాయుడు పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటిపై జోగి రమేష్ నేతృత్వంలో దాడిచేయడమే కాకుండా.. బాధితులైన టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెట్టడం తగదని అభిప్రాయ పడ్డారు. ఇది రాజారెడ్డి రాజ్యాం గా తెలుగుదేశం పార్టీ నేతలు అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అదికార పార్టీ దుర్వినియోగం చేస్తున్నదన్నారు. ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ సీనియర్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయ]డం ఎంత వరకూ సబబని ప్రశ్నించారు. ఎం.ఎల్.ఏలు, ఎంఎల్.సిలతో పాటు,  మాజీ మంత్రుల్ని బెదిరించిన, నెట్టివేసిన అమ్మిరెడ్డిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సమావేశం నిర్ణయించింది. అక్కడ న్యాయం జరగకపోతే ప్రైవేటు కేసు వేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షం బహిష్కరించిన ఎన్నికల్లో గెలిచామని  సంబరాలు చేసుకోవడం  అధికార వై.సి.పి కే తగిందని, ఇంతుకు మించిన సిగ్గు మాలిన తనం లేదని సమావేశానికి హాజరైన నేతలు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ అపహాస్యం చేసిన వైనాన్ని దేశ ప్రజలందరూ చూశారన్నారు. నిజమైన ప్రజాతీర్పు కోరాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ టి.డి.పి నేతలు సవాల్ విసిరారు.
అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, తప్పుడు నివేదికలు సృష్టించి గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి అర్హత లేని గౌరీ శంకర్  అనే వ్యక్తిని  బోగస్ సర్టిఫికెట్లతో ఫైబర్ నెట్ ఈడీగా ముఖ్యమంత్రే స్వయంగా సంతకం పెట్టి నియమించడం దేనికి సంకేతం.? అని ప్రశ్నించారు.  రూ.4,700 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును వినూత్న ఆలోచనలతో రూ.330 కోట్లతో పూర్తిచేసి ప్రభుత్వానికి సుమారు రూ.4 వేల కోట్లు ఆదా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు.దాదాపు. 22వేల కి.మీ ఫైబర్ కేబుల్ ను టీడీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగిందన్నారు. సుమారు 10 లక్షల కనెన్షన్లు  ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి ఆదా చేసిన అధికారులపై అక్రమ కేసులు పెట్టడాన్ని సమావేశం ఖండించింది.
భారత్ బంద్ కు మద్దతు
 అన్నదాతలకు అండగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ తన సంఘీభావం తెలియజేసింది.  ఈ బంద్ లో పాల్గోనాలని, విజయవంతం చేేయాలని పార్టీ శ్రేణులకు సూచించింది. వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు పట్టుపడటం రాష్ట్రంలో పోలీసుల పని తీరును చెప్పకనే చెప్పిందని తెలుగుదేశం నేతలుఅభిప్రాయ పడ్డారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ  ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకులు నిమ్మల రామానాయుడు,  యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణ మూర్తి, దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప,  బోండా ఉమా మహేశ్వరరావు,  పి.అశోక్ బాబు,  టీడీ జనార్థన్, బీద రవిచంద్ర యాదవ్,  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: