భార‌త్‌లో ఫ‌స్ట్ `ఎల‌క్ట్రిక్ హైవే` ఎక్క‌డంటే..?

Paloji Vinay
     భ‌విష్య‌త్తు ర‌వాణా మొత్తం ఎల‌క్ట్రిక్ వాహానాల‌పైనే ఆధార‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే ఇంధ‌న వాహ‌నాల వినియోగం తగ్గుతూ.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా ఎల‌క్ట్రిక్‌ ద్విచ‌క్ర వాహ‌నాల వినియోగం భారీగా పెరుగుతోంది. నానాటికి పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ రేట్ల‌తో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు దృష్టి సారించేలా కేంద్ర ప్ర‌భుత్వం కూడా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల స్థానంలో  విద్యుత్ తో న‌డిచే భారీ వాహ‌నాలు కూడా రానున్నాయి.

      ఈ నేపథ్యంలో విదేశాల తరహాలో దేశంలో మొట్టమొదటిసారిగా రహ‌దారిపై ఎలక్ట్రిసిటీ సిస్టమ్ సాంకేతిక‌త రానుంది. అంటే.. ఈ హైవేలో వెళ్లే అన్ని వాహనాలు పవర్ ద్వారానే ప్ర‌యాణిస్తాయి.  రైళ్లు, మెట్రో ట్రైన్‌లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలాగే ఈ హైవే పై  ఎలక్ట్రిక్ వాహనాలు కూడా న‌డుస్తాయి. జ‌ర్మ‌నీలో రెండేళ్ల క్రితమే ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని తొలిసారిగా నిర్మించారు.  దీంతో హైవేపై వెళ్లే క్రమంలో వాహన ట్రక్కులు అప్పటికప్పుడే రీచార్జ్ చేసుకుంటాయి.

ఇప్పుడు విదేశీ తరహాలో దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ జైపూర్ లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇప్పటికే ఈ బిగ్ డీల్ కు సంబంధించి విదేశీ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని, ఇది తన క‌ల‌ల‌ ప్రాజెక్టుగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. చర్చలు ముగిసిన వెంటనే ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవే పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయ‌ని ఆయ‌న చెప్పారు.

   ప్రపంచవ్యాప్తంగా ఇందన ధరల పెరుగుద‌ల‌తో అందరూ ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు.  ఇందన వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుత రవాణా అభివృద్ధికి ఎలక్ట్రిసిటీ అనేది మంచి ప‌రిణామంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టుపై ప్రతిపాదనలకు ఆమోదం వ‌స్తే.. ఎలక్ట్రిక్ హైవే రవాణాను మరింత విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు అంటున్నారు. భార‌త్‌లో ముందుగా ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ హైవేను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఢిల్లీ-మంబై నగరాల మధ్య కూడా ఎలక్ట్రిక్ హైవే వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: