బిగ్ బాస్ బ్రోతల్ హౌస్, 24 గంటలు లైవ్ పెట్టె దమ్ము ఉందా...?

Gullapally Rajesh
బిగ్ బాస్ షో విషయంలో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సీనియర్ రాజకీయ నాయకుడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. బిగ్ బాస్ పైన నేను చాలా సంవత్సరాల నుండి పోరాడుతున్న అని అన్నారు. కోర్టులు నేను వేసిన పిటిషన్ ను పెండింగ్ లో పెడుతున్నారని ఆయన ప్రస్తావించారు. బిగ్ బాస్ లో 105 రోజులు యువతి యువకులను ఒక గది లో పెడుతున్నారు అని లోపల ఎం జరుగుతుందో ఎవరికి తెలుసు అని నిలదీశారు.
బిగ్ బాస్ కి ఛాలెంజ్ 24 గంటలు లైవ్ పెట్టగలరా అని ఆయన ప్రశ్నించారు. బిగ్ బాస్ ఒక బ్రోతల్ స్వర్గం అన్నారు. రెడ్ లైట్ ఏరియా సంస్కృతి ని తీసుకువస్తున్నారు అని మండిపడ్డారు. దీనికి నాగార్జున హోస్టుగా ఉన్నారు అని దీని వల్ల సమాజానికి ఎం చెప్తున్నారు అని ప్రశ్నించారు. ఒకరితో ముద్దు పెట్టుకొని మరొకరితో డేటింగ్ చేస్తున్నారు అని ఆరోపణలు చేసారు. ఇది సాంస్కృతిక దోపిడీ..దీనిని తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేసారు. దీనిపై మరోసారి కోర్టుకు వెళ్తా అన్నారు.
ఇటీవల కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. అదో బూతుల ప్రపంచమని, వేల కోట్ల రూపాయలకు ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు శనివారం. న్యాయవ్యవస్థ, పోలీసులు తనకు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది సమాజంలో విష సంస్కృతిని పెంచేలా ఉందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  వెంటనే దీనిని నిషేధించాలని డిమాండ్ చేశారు నారాయణ. ఇలాంటి షోలకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తున్నాయని ఈ సందర్భంగా నిలదీశారు. దీని వల్ల ఉపయోగం ఎవరికో చెప్పాలన్నారు ఆయన. బిగ్‌బాస్ షో అంటేనే బూతుల ప్రపంచమని మండిపడిన ఆయన దీనిని వేల కోట్ల రూపాయల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: