అక్టోబర్ నెలాఖరుకు కరోనా తగ్గుముఖం !

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రం లో కోవిడ్, సీజనల్ డీసీస్ ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉంది అనేదానిపై ముఖ్యమంత్రి కెసిఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం DH శ్రీనివాసరావు మాట్లాడుతూ  ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయని.. హైదరాబాద్ లో అత్యధికంగా నమోదయ్యాయని పేర్కొన్నారు.  మలేరియా కూడా అత్యధికంగా నమోదు అవుతున్నాయని.. కొత్తగూడెం, ములుగు లో ఎక్కువ గా నమోదు అవుతున్నాయన్నారు. 

2019 లో డెంగ్యూ కేసులు 4వేలు రిపోర్ట్ అయ్యాయని.. ఈ సంవత్సరం సెప్టెంబర్ 10 వరకు  3 వేల కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వైరల్ ఫెవర్స్ కూడా ఈమధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.  ప్లేట్ లెట్ కౌంట్ పడిపోతే ప్రైవేట్ లో జనాలను పరుగులు పెట్టిస్తున్నారు...వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు.  అక్టోబర్ నెలాఖరు వరకు కొంత తగ్గుముఖం పెట్టె అవకాశం ఉందని.. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు..

రాష్ట్రంలో 0.4% మాత్రమే పోసిటివిటీ రేట్ ఉంటుందని.. కోవిడ్ మన దగ్గర నియంత్రణ లో ఉందని తెలిపారు.. విద్యాసంస్థలు రీ ఓపెన్ అయ్యాయి కాబట్టి కేసులు ఎక్కువ నమోదు అవుతాయి అనుకున్నాము.. కానీ క్లస్టర్ బ్రేక్ ఎక్కడ చోటు చేసుకోలేదు.. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్స్ పంపవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు 1లక్ష 15వేల మందికి విద్యార్థులకు టెస్ట్ చేస్తే 55 పోసిటివ్ వచ్చిందని.. సెప్టెంబర్ లో పీక్ లోకి వెళ్తుంది కేసులు విపరీతంగా పెరుగుతాయి.. అన్నారు.. కానీ మన రాష్ట్రంలో అదుపులో ఉందని వివరించారు...మాస్క్ ధరించడం మానొద్దు.. తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. IT రేలేటెడ్ కంపెనీ లు ఇంకా ప్రారంభం కాలేదు.. IT రేలేటెడ్ కంపెనీ లు ఓపెన్ చె య్యమని యాజ మాన్యాలను కోరుతున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: