విశాల్ స్పందనతో టాప్ హీరోల పై పెరుగుతున్న ఒత్తిడి !

Seetha Sailaja
తమిళ హీరో విశాల్ కు తెలుగు మూలాలు ఉండటంతో ఎప్పటి నుంచో  టాలీవుడ్ పై కూడ అతడికి కన్ను ఉంది. నిరంతరం ఏదో వివాదంలో తల దూర్చే విశాల్ ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ సేవల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మల్టీప్లెక్స్ లతో సహా అన్ని థియేటర్లలోని టికెట్స్ ప్రభుత్వ పోర్టల్ ద్వారానే విక్రయించాలని ప్రతిపాదిస్తూ ఒక జీవో జారీ చేసిన విషయం  తెలిసిందే.

రైల్వే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ లో ఈ సినిమా టికెట్స్ పోర్టల్ పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుందని సంకేతాలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై టాలీవుడ్  కు చెందిన టాప్ హీరోలు ఎవరు ఇప్పటి వరకు స్పందించ లేదు. అయితే డైరెక్టర్ దేవకట్టా మాత్రం సోషల్ మీడియా ద్వారా అనేక సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

హీరో తమిళ హీరో విశాల్ మాత్రం ప్రభుత్వ ఆన్ లైన్ సినిమా టికెటింగ్ పోర్టల్ విధానాన్ని స్వాగతిస్తున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ విశాల్ ఒక విజ్ఞాపన విడుదల చేసాడు. 'థాంక్యూ’ ఏపీలో థియేటర్లలో ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ను అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి హ్యాట్సాఫ్. తమిళనాడులో కూడా మేము ఎప్పటి నుంచో దీనిని అమలు చేయాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇది జరగడం సంతోషంగా ఉంది. ఇది 100% పారదర్శకతను తెస్తుంది కనుక ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ దీన్ని స్వాగతించాలి. తమిళనాడు రాష్ట్రం కూడ ఈవిదానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేసాడు.

అంతేకాదు ఈవిధానం వల్లన నిర్మాతలు ఖర్చులు తిగ్గించుకుని సినిమా బడ్జెట్ అదుపులో ఉంచడానికి దోహదపడుతుందని  విశాల అభిప్రాయ పడుతున్నాడు. ఇప్పుడు విశాల్ చేసిన కామెంట్స్ తో మన టాప్ హీరోలు కుడా ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: