గుట్టుగా వాట్స‌ప్ మేసేజులు చ‌దువుతున్న ఫేస్‌బుక్‌..!

Paloji Vinay
ప్ర‌పంచంలో ఎక్కువ‌గా ఉప‌యోగించే సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌లో ఫేస్‌బుక్, వాట్స‌ప్‌లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. అయితే, వాట్సప్ వినియోగిస్తున్న కోట్ల మంది యూజ‌ర్ల అకౌంట్ల‌పై ఫేస్‌బుక్ నిఘా ఉంచింద‌ని అమెరికా ఇన్వెస్టిగేషన్ మీడియా సంస్థ ప్రొపబ్లికా ఇన్వెస్టిగేషన్ కథనం వెలువ‌రించింది. ఈ క‌థ‌నం ప్ర‌కారం.. ఆస్టిన్ టెక్సాస్ డ‌బ్లిన్ సింగ‌పూర్ లో వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను నియ‌మించి ఫేస్‌బుక్ త‌మ వాట్స‌ప్ యూజ‌ర్ల మెసేజులు చ‌దువుతుంద‌ని ఆరోపించింది. అయితే, ఈ వ్య‌వ‌హారం కోసం ఫేస్‌బుక్ త‌న సొంత అల్గారిథంను వాడుతుంద‌ని క‌థ‌నంలో పేర్కొంది.
 
  ఈ ఆరోప‌ల్ని ఖండించిన ఫేస్‌బుక్.. కాంట్రాక్టు ఉద్యోగుల‌ను నియ‌మించింది కేవ‌లం యూజ‌ర్ల ప్రైవ‌సీని ప‌రిర‌క్షించ‌డానికి, యూజ‌ర్లు పంపించే రిపోర్ట్ అబ్యూజ్‌.. ఇత‌ర‌త్ర ఫిర్యాదుల‌ను స‌మీక్షించ‌డం కోస‌మేన‌ని తెలిపింది. ఎన్‌క్రిప్ష‌న్ సెక్యూరిటి కార‌ణంగా వాట్సాప్ కాల్స్‌, మేసేజ్‌ను ఫేస్‌బుక్ ఎలాంటి ప‌రిస్థితిలోనూ చ‌ద‌వ‌లేద‌ని వివ‌రించింది.

 భారత్ తో పాటు ఐరోపాయేతర దేశాల్లో తమ ప్రైవసీ పాలసీలో  ఇటీవల మార్పులు చేసింది వాట్సాప్‌. వాట్సాప్ ఉపయోగించాలంటే.. కచ్చితంగా కొత్త విధానానికి అనుమతించాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజ‌ర్ల‌కు నోటిఫికేషన్ రూపంలో  ఈ సంగ‌తిని తెలిపింది వాట్సాప్. ఈ విధానానికి వినియోగ‌దారుల‌కు అనుమతి ఇవ్వ‌కుంటే.. ఫిబ్రవరి 8 2021 తర్వాత వాట్స‌ప్ అకౌంట్ డిలీట్ అవుతుందని దీనిలో స్పష్టంగా తెలియజేసింది. అంటే ఈ కొత్త విధానాలకు ఒప్ప‌కోక‌పోతే  ఫిబ్రవరి 8 తర్వాత  వాట్సాప్ ను వాడ‌లేరు.

వాట్సాప్ మెసేజింగ్ యాప్‌ను  2014లో నాస్సెంట్ నుంచి ఫేస్‌బుక్‌ 19 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా వాట్స‌ప్ మెసిజింగ్ యాప్‌లో మొత్తంగా రోజుకి వెయ్యి కోట్లకి పైగా మెసేజ్ లు వెళ్తున్నాయ‌ని తెలుస్తోంది.  ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ‌ల్ల‌ యూజర్ల మధ్య సురక్షితమైన ఛాటింగ్ ఉంటుందని వినియోగ‌దారుల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్ల‌దు అని ఫేస్ బుక్-వాట్సాప్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వ‌స్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: