తెలంగాణ గ‌డ్డ‌పై అమిత్ షా-రాహుల్ ఢీ..?

Paloji Vinay
ప్ర‌స్తుతం గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఎక్క‌డ చూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యమై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఉప ఎన్నిక అన్నప్ప‌టి నుంచి రాజ‌కీయ పార్టీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. అధికార పార్టీ ప‌థ‌కాల మీద ప‌థ‌కాలు ప్ర‌క‌టించింది. ఇటు బీజేపీ పార్టీ నుంచి బ‌రిలో ఉన్న ఈట‌ల చావోరేవో అన్న‌ట్టు దృఢ నిశ్చ‌యంతో కొడితే ఏనుగు కుంబ‌స్థ‌లాన్ని కొట్టాల‌ని పంతంతో ఉన్నాడు. మ‌రోవైపు కాంగ్రెస్ అనుకోకుండా ముందు వ‌రుస‌లోకి వ‌చ్చి నిల‌బ‌డింది. ఈ సంద‌ర్భంలో ఉప ఎన్నిక వాయిదా పడ్డా నేత‌లు మాత్రం వారివారి ప్లానింగ్‌లో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంపై జాతీయ స్థాయి కీల‌క నేత‌లు ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ విమోచ‌న దినం సెప్టెంబ‌ర్ 17 సంద‌ర్భంగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నాడు. నిర్మ‌ల్ వెయ్యి ఊడ‌ల మ‌ర్రి వ‌ద్ద జ‌ర‌గ‌బోయే భారీ స‌భ‌లో అమిషా ప్ర‌సంగించ‌బోతున్నారు. ఆ స‌భ కోసం తెలంగా కమ‌ల ద‌ళ‌ప‌తి క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వ‌బోతున్నారు.

 అయితే, ఇదే రోజున వరంగల్లో నిర్వ‌హించ‌బోయే కాంగ్రెస్ గిరిజ‌న దండోరా స‌భ‌కు  ఆ పార్టీ జాతీయ నేత ఏఐసీసీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటార‌ని ప్ర‌క‌టించారు ఆ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన త‌రువాత తొలిసారిగా రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో ఆ స‌భ‌కు భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేసీ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి టీమ్ హ‌స్తిన‌కు వెళ్ల‌బోతున్న‌ట్టు స‌మాచారం.

  అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కీల‌క నేత‌లు తెలంగాణ‌లో ప‌ర్య‌టిన ఉండ‌డంత తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి మ‌రింత రాజేసుకోనుంద‌ని తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేన‌ని చెప్పుకునేందుకు రెండు పార్టీల నేత‌లు కుతూహ‌లంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఈ రెండు పార్టీల స‌భ‌ల‌కు చెక్ పెట్టేందుకు గులాబీ నేత‌లు ఏదైన వ్యూహం ర‌చిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: