జగన్ అంటే సీఎం : ఈ సారి చవితి నిందలు ఆయనవి!

RATNA KISHORE
నిందలు ఎలా ఉన్నా నిజాలు
బాగుంటాయి అర్థం అయితే
కాస్త జ్ఞాన బోధ కూడా చేస్తాయి


బయట వాతావరణం బాలేదు. థర్డ్ వేవ్ వస్తుంది కనుక బాలేదు అని రాశారు. కానీ బయట అంతా బాగుంది అని వాదిస్తున్నారు కొందరు. బయట బాగున్నా ఇంట బాగున్నా ఈ సారి జగన్ ప్రభుత్వం మాత్రం జాగ్రత్తలే ముఖ్యం అని నెత్తీ నోరూ కొట్టుకుని చెబు తోంది. బాగుంటే! వచ్చే ఏడాది వైభవంగా వినాయక చవితి చేసుకుందాం, ఈ సారి మాత్రం వేడుకలు రద్దు చేసుకుందాం అని హిత వు చెబుతున్నాడు జగన్. యువ ముఖ్యమంత్రి మాటలు కాస్త ఇప్పుడు వైరల్ అయిపోయాయి. ఆయనపై హిందూ వ్యతిరేకి అ న్న మాట ఒకటి ప్రచారం చేస్తున్నారు బీజేపీ లీడర్లు. అసలు ఊరేగింపు వద్దు, పందిళ్లు వద్దు జాగ్రత్త అని చెబుతోంది పోలీసు వర్గం సైతం..ఇది విని భయపడిపోతున్నారు హిందువులు, వారి పెద్దలు. ఎందుకంటే గత సారి ఇలానే చెప్పి హాయిగా ఎన్నికలంటూ ప్ర చార సభలు నిర్వహించారే! అప్పుడు ఏమయింది ఈ ముందస్తు జాగ్రత్త అని ప్రశ్నిస్తున్నారు..హిందువులు వారి పెద్దలు.


ఆయన తప్పేం లేదయ్యా!
వినాయక చవితి పండుగ వస్తే అందరూ చంద్రుడ్ని చూడొద్దు అంటారు. దానికో వ్రత కథ చదివి వినిపించి, ఆ తప్పు ఎందుకు చే యకూడదో చెప్పి చూస్తారు. ఆచరించమని సూచిస్తారు. ఆదేశాలు జారీ చేస్తారు కూడా పెద్దలు. ఏదేమయినా నాలుగు అక్షతలు నెత్తిపై వేసుకుంటే చాలు చంద్రుడి చూసినా.. నిందలు పడవు అని చాలా మంది చెబుతారు అది వైదికం ఇచ్చే చిన్న పరిష్కారం లాంటిది అనుకోండి పోనీ! కానీ ఈసారి వైదికం పరిష్కారం కన్నా సామాజిక కట్టడే ప్రధానం అని జగన్ భావిస్తున్నారు. కరోనా కా రణంగా ఇప్పటికే అనేక అవస్థలు పడుతున్న రాష్ట్రం ఈ మాసివ్ సెలబ్రేషన్స్ కు ఓకే చెప్పడం లేదు.


సహస్ర రూపాలు మన సమస్యలు (సహస్ర అంటే వెయ్యి)
 
చవితి సందర్భంగా కనీసం గుడిలో కూడా పంది రి వేయొద్దని అంటోంది. వీధి చివరో అరుగుపైనో వద్దంటే ఒప్పుకుంటాం కానీ గు డికి కూడా ఆంక్షలే నా అని చాలా మంది హిందు వులు, వారి పె ద్దలు ఆక్షేపిస్తున్నారు. జగన్ ఉద్దేశం ఏదయినా కరోనా కట్టడి త న ధ్యేయం అంటాడు మొదట. ఇది తమకు తెలు సు అని తమకు జాగ్రత్తలు నేర్పక్కర్లేదని అంటారు హిందువులు, వారి పెద్దలు. పాపం జగన్ ఇవి వి న్నా కరోనా కట్టడి కారణంగానే ఈ నిర్ణయం అని మరో మారు వాదిస్తాడు. ఈ తగువు కారణంగా జగన్ ఈ సా రి నిందను మోస్తాడు. జనం దగ్గర కాస్త చెడ్డ అవుతా డు. ఇప్పుడీ సమస్యకు పరిష్కారం ఏంటన్నది పెద్ద తలనొప్పి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: