బెయిల్ రద్దు అయితే...? విజయసాయిని అరెస్ట్ చేస్తే...?
ప్రజలకు ఉద్యోగాలు లేవు అని మా ఎమ్మెల్యే కేతిరెడ్డి 264 మంది వాలంటీర్స్ ను తొలగించారు అని అసహనం వ్యక్తం చేసారు. విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డి కి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది అన్నారు ఆయన. సెప్టెంబర్ 22 వతేదీన విజయసాయిరెడ్డి ఈడీ ఛార్జ్ షీట్ లో సీబీఐ కోర్టుకు హాజరుకావాలి అని ఏర్కొన్నారు. నేను వేసిన బెయిల్ రద్దు కేసు సెప్టెంబర్ 14న వస్తుంది ఆలోగా ఆయన విదేశాలకు వెళ్తే బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ చేయాల్సి వస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఏదో పూచీకత్తు పై బాండ్లు ఇచ్చి వెళ్తున్నారు అని తెలిసింది అన్నారు.
నన్ను విదేశాలకు వెళ్తున్నారు అని ప్రచారం చేసి విజయ సాయి రెడ్డి ఇప్పుడు వెళ్తున్నారు అని ఆయన లోపల అనుకునేది ఇతరులకు ఆపాదించారు విజయ సాయి రెడ్డి అని విమర్శించారు. కేంద్ర రైల్వే సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చిన సత్యనారాయణ పీడీ అకౌంట్లు ద్వారా అవకతవకలు కు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి అని 2 లక్షల అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిల్లో వచ్చిన డబ్బులను వేరే ఖాతాలకు బదిలీ చేశారు అని విమర్శలు చేసారు. పారిశ్రామిక విధ్వంస కాండను జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి కుడా వ్యాపింప చేస్తున్నారు అన్నారు. తమిళనాడు లో నాకున్న పవర్ ప్లాంట్ కు కూడా అక్కడ అధికారం లో ఉన్న వారితో సంబంధాలను ఉపయోగించి ఇబ్బందులు కలుగ చేస్తున్నారు అని మండిపడ్డారు.