హైద‌రాబాద్ లో పుట్టిపెరిగాం..మేం త‌లుచుకుంటే ఇక్క‌డ ఎవ‌డూ ఉండ‌డు : త‌ల‌సాని

ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ లకు మరోసారి పెద్దపీట వేశారని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ లో భగత్, సికింద్రాబాద్ లో తలసాని సాయి , ఇక ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ లకు సీఎం అవకాశం ఇచ్చారని త‌ల‌సాని వ్యాఖ్యానించారు.దీనివల్ల తెలంగాణ లో బడుగు బలహీన వర్గాల వాళ్లకు ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారంటూ త‌ల‌సాని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ టీఆర్ ఎస్ పార్టీకి , ఉద్యమానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఆయ‌న‌కు అవకాశం ఇచ్చారని త‌ల‌సాని అన్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ఈ అవకాశం కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. చాలా రాజకీయ పార్టీలు మాట ఇచ్చి నిలబెట్టుకోవని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ లకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారంటూ త‌ల‌సాని సంతోషం వ్య‌క్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ సబ్బండ ప్రజలు గెల్లు శ్రీనివాస్ ను ఆశీర్వదించి దివించాలని కోరుతున్నామంటూ త‌ల‌సాని వ్యాఖ్యానించారు.

కొంతమంది అధికారం ఉండగా.... అధికారం లేనప్పుడు మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనించాలని త‌ల‌సాని కోరారు. టీఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలదేన‌ని అన్నారు. టీఆర్ ఎస్ తప్ప ఏ పార్టీ గెలిచినా హుజురాబాద్ లో అభివృద్ధి సాధ్యం కాదని త‌ల‌సాని వ్యాఖ్యానించారు. సాగర్ ఫలితాలే హుజురాబాద్ లోనూ రిపీట్ అవుతాయని త‌ల‌సాని వ్యాఖ్యానించారు. జానారెడ్డి గెలుస్తార‌ని చాలామంది అంచనా వేశారని.. కానీ జరిగిన రిజల్ట్ వేరంటూ త‌ల‌సాని అన్నారు. అప్పట్లో దామోదర్ రెడ్డి మీద ఈటెల తట్టుకోగలడా అన్నారని కానీ ఇవాళ గెల్లు శ్రీనివాస్ విషయం లో కూడా అదే పునరావృతం కానుందని త‌ల‌సాని చెప్పుకొచ్చారు.  

కొంతమంది దద్దమ్మలు దళిత బంధు మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారంటూ త‌ల‌సాని ఆగ్ర‌హానికి గుర‌య్యారు.
దళిత బంధు , గొర్రెల పంపిణీ పై పిచ్చి మాటలు మాట్లాడుతున్న కొన్ని పత్రికలు వెంట‌నే సర్వే చేయాలని త‌ల‌సాని చెప్పారు. ఆదిలాబాద్ లో ఆదివాసీ గూడేలకు వెళ్లిన వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. జైలుకు వెల్లినోడు జైలు గురించి మాట్లాడి ...ముఖ్యమంత్రి ని ఏక వచనం తో మాట్లాడుతున్నారంటూ మండి ప‌డ్డారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తాము తలుచుకుంటే ఇక్కడ ఎవ్వడు ఉండరంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన త‌మ‌కంటే బలవంతుడు ఎవ్వడు ఉంటాడు?? ఉంటాడ‌ని ప్ర‌శ్నించారు. జనాన్ని చూసుకొని పిచ్చి కూతలు కూస్తే తామేంటో చూపిస్తామ‌ని త‌ల‌సాని వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: