బిగ్ బ్రేకింగ్: కాంగ్రెస్ కు జానారెడ్డి రాజీనామా..?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి... కాంగ్రెస్‌ పార్టీ అగోమ్యచారం గా తయారైంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్‌ నాయకులు మొత్తం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి జంప్‌ అయ్యారు. అలాగే.. కొందరు నాయకులు కాంగ్రెస్‌ పార్టీ లో గెలిచి మరీ.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్‌ పార్టీ లో వలసలు మాత్రం ఆగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.  
అయితే.. రేవంత్‌ రెడ్డి...  తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాస్త మెరుగు పడుతున్నట్లు కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో తాజాగా  కాంగ్రెస్‌ పార్టీ దిమ్మతిరిగే షాక్‌ తగిలింది.  కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ హోం శాఖ మంత్రి జానారెడ్డి... కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.  మరో రెండు రోజుల్లో దీనిపై అధికారికంగా జానారెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 తన ఆరోగ్యం సహకరించక పోవడం కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ కి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక.. కందూరు జానారెడ్డి...కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘ చరిత్ర ఉన్న నాయకులు. అలాగే.. నాగార్జున సాగర్‌ నియోజక వర్గం నుంచి చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా.. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో... టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ పై సీనియర్‌ నాయకులు కందూరు జానారెడ్డి 18 వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలైన  సంగతి తెలిసిందే. ఆ ఓటమితో జానారెడ్డి కి ఊహించన షాక్‌ తగిలింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: