తెరాస నుంచి "గెల్లు" ఉంటే ఈటల విజయం ఖాయమేనా..?

MOHAN BABU
 హుజురాబాద్ ఉప ఎన్నిక అధికార తెరాస పార్టీలో చిచ్చు పెడుతోంది. ఆ పార్టీ టికెట్  గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఖరారైందనే నేపథ్యంలో ఒక వర్గం అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ కోటరీలోని ఓ కీలక నేత ఈ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. విద్యార్థి నేతగా ఆ పార్టీలో గుర్తింపు పొంది, ప్రస్తుతం ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు నాయకుడు గెల్లు శ్రీనివాస్ టికెట్ ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం విద్యార్థి సంఘం తరఫున యూనివర్సిటీల ఉద్యమానికి నాయకత్వం వహించిన తనకు మినహా మరి ఎవరికి ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉండరాదనే కోణంలో గెలుపుకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు గుసగుసలాడుకుంటున్నారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి కోసం టిఆర్ఎస్ పార్టీ అష్టకష్టాలు పడుతుంది.

 ఇప్పటికీ ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా తెలియలేదు. అయితే ఇటీవల గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైనట్లు తెలంగాణ భవన్ నుంచి ఒక వార్త వచ్చింది. అంతే కాకుండా హుజురాబాద్ నేతలతో మంత్రి హరీష్ రావు ఇటీవల సిద్ధిపేటలో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో గెల్లు శ్రీనివాస్ ప్రధానంగా ఉండడం, ఆయనకు టిక్కెట్ ఇచ్చే చాన్స్ ఉందంటూ టిఆర్ఎస్ లోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. వాస్తవంగా గతంలో కౌశిక్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి టికెట్ వస్తుందనే ధీమాతో పార్టీ నేతలు ఉన్నారు. కానీ కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం రావడంతో ఇక బీసీ వర్గానికి టికెట్ ఇస్తారని భావిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ లో నుంచి చేరిన స్వర్గం రవి , టిఆర్ఎస్ నేత పొన్నగంటి మల్లయ్యతో పాటు గెల్లు శ్రీనివాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తే పని సులభం అవుతుందని  భావిస్తున్నారు. అయితే గెల్లు శ్రీనివాస్ కు టికెట్ వస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ పక్క ఓడిపోతుందని లోకల్ నాయకులు తెలియజేస్తున్నారు. అటు ఈటెలకు కూడా తెరాసనే విజయం అందించిన పార్టీ అవుతుందని వారు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: