అవునా ! ఎందుకు? : మోడీతో జ‌గ‌న్ కు త‌గువు?

RATNA KISHORE

అవునా ! ఎందుకు? : మోడీతో జ‌గ‌న్ కు త‌గువు?


భాష‌ల ఔన్న‌త్యం మోడీకి, వెంక‌య్య కూ తెలుసు.. కొన్నింట విభేదం ఉన్నా వాళ్లిద్ద‌రూ ఈ విష‌య‌మై న‌చ్చుతారు కూడా! ప్రాథ మిక విద్యను మాతృభాష‌లో బోధించేందుకే ఒప్పుకోని రాష్ట్రం రేప‌టి వేళ తెలుగును ఎలా ప‌రిర‌క్షిస్తుంది అన్న‌ది ఓ సందేహం. ఇ దీ తెలుగు రాష్ట్రాల‌లో ఒక్క‌టైన ఆంధ్రావ‌నిలో తెలుగు ప‌రిస్థితి. నిన్న‌టి వేళ ఒక చిత్రం చూశాను..మ‌న ద‌గ్గ‌ర అలా ప్ర‌వ‌ర్తించ‌ని నా య‌కులనూ చూశాను. మ‌న భాష అంటే మ‌మ‌కారం లేనందున మ‌నం ఇలా వెనుకంజ‌లో ఉన్నాం అని కూడా అనుకుంటాను. అందుకే ఆంధ్రా క‌న్నా తెలంగాణ‌లో కాస్తయినా తెలుగుకూ,సంస్కృతికీ విలువ‌. నిన్నటి వేళ సినారెకు నివాళి అర్పించి,త‌న త‌ర ఫున నాలుగు మాట‌లు చెప్పారు.కానీ ఇక్క‌డ పేరున్న ఏ క‌వినీ స్మ‌రించ‌రు. అలాంటిది మోడీ మాట వింటారా అంటే అదొక ఆచ‌ర ణ‌కు అనువు కాని విష‌య‌మే!భాష‌ను ప‌ల‌క‌డం, భాష‌ను ప్రేమించ‌డం అన్న‌వి ఎంతో కీల‌కం.. పిల్లాడిని మాతృభాష‌కు దూరం చే సి సాధించేది ఏమీ ఉండ‌ద‌ని ఎవ్వ‌రూ ఎందుకు గుర్తించ‌రు. ఎందుకు ప్ర‌భుత్వాల‌ను నిల‌దీయ‌రు. సాంకేతిక విద్య ను తెలుగులో బోధించ‌మ‌ని అడ‌గ‌డం లేదు కానీ ప్రాథ‌మిక విద్య నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వండ‌ని ఎందుకు అడ‌గ రు?



భాష‌కూ,పాల‌న‌కూ మ‌ధ్య ఎడ‌తెగ‌ని దూరం పెంచిన వారెవ్వ‌ర‌యినా ఉన్నారంటే అది ఆంధ్రా  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఒక్క‌రే అన్న‌ది ని ర్వివాదం. తెలుగులో బోధ‌న‌కు, తెలుగు బోధ‌న‌కు మ‌ధ్య తేడా ఆయ‌న‌కు తెలియ‌దా అంటే తెలుసు కానీ ఆయ‌న ఒప్పుకోరు. ఓ విధంగా ప్రాథ‌మిక విద్య‌న‌యినా మాతృభాష‌లో  చెప్పించండి అని చెప్పినా విన‌డం లేదు..మా పిల్ల‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు రా వాలంటే వారికి ఇంగ్లీషు మీడియం అవ‌స‌రం అని చెబుతున్నారు. ఇందులో కొంత సెంటిమెంట్ కూడా చొప్పిస్తున్నారు. పేద పిల్ల ల‌కు ఇంగ్లీషు చ‌దువులు అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. కానీ ఆంగ్ల మాధ్య‌మ బోధ‌న ఏ స్థాయి నుంచి కావాలి..ఎవ‌రికి కా వాలి..ఆ అవ‌స‌రం మేర‌కు మ‌న ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అన్న‌ది ఇప్పుడు అవ‌సరం అయిన ప్ర‌శ్న..మాతృభాష లో బోధ నకు కేంద్రం కూడా ప్రాధాన్యం ఇస్తుంది. నిన్న‌టి వేళ నూతన జాతీయ విద్యా విధానం ప్ర‌వేశ‌పెట్టి ఏడాద‌యిన సంద‌ర్భంగా ప్ర‌ధాని సైతం ఈ విష‌య‌మే మాట్లాడారు. కానీ జ‌గ‌న్ మాత్రం ఆయ‌న‌తో విభేదించి తాను తీసుకువ‌చ్చిన విధాన‌మే కొత్త సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది అన్న విధంగా స్పందిస్తున్నారు.


ఇంకా చెప్పుకుంటే.. త‌న ప‌త్రిక పేరు సాక్షి.. ప‌త్రిక‌కు ఎంత అంద‌మ‌యిన పేరు..పానుగంటి వారు సాక్షి వ్యాసాలు రాసి మాతృ భా ష ఔన్న‌త్యాన్ని చాటిన వైనం కూ డా ఉంది. అలానే మాతృభాష‌కు జేజేలు ప‌లికాక ఎంద‌రెందరు గొప్ప‌వారు అయ్యారో  కూడా దా ఖ‌లాలు ఉన్నాయి.  రాజ‌కీయ నేప థ్యాలు ఎలా ఉన్నా వెంక‌య్య‌, ఎన్టీఆర్ లాంటి వారే తెలుగు ప‌లికే నేత‌ల జాబితాలో ముం దుంటారు. కానీ తెలుగును కాపాడేందుకు జ‌గ‌న్ ఎందుకో వెనుకంజ వేస్తున్నారు. ఆఖ‌రికి మోడీ చెప్పినా విన‌డం లేదు. నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీలో మాతృభాష‌కు ప్రాధా న్యం ఇవ్వాల‌ని కేంద్రం చెబుతుంటే జ‌గ‌న్ త‌న దారి మాత్రం వేర‌నే అంటున్నారు. మో డీ చెప్పిన మాట‌కు ఆయ‌న ఎదురు చెబుతు న్నారు. త‌మ రాష్ట్రంలో ప్రాథ‌మిక విద్య నుంచి అంతా పాటించేది,అమ‌లు చేసేది ఆం గ్ల మాధ్య‌మేన‌ని చెబుతున్నారు. ఇదీ అసలు త‌గువు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: