కరోనా టీకా తీసుకోకపోతే అక్క‌డ‌ అరెస్టే..!

Paloji Vinay
క‌రోనా డెల్టా వేరియంట్ తీవ్రంగా విజృంభిస్తున్న త‌రుణ‌మిది.. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించినా వైర‌స్ ప్ర‌భావం పెరుగుతోంది. దీనికి ప్ర‌స్తుతం టీకా తీసుకోవ‌డం ఒక్క‌టే ప‌రిష్కారం. అయితే కొన్ని దేశాలు త‌మ పౌరుల‌కు టీకా తీసుకుంటే కొన్ని ఆఫ‌ర్లు ప్ర‌క‌టించారు. అయితే టీకా తీసుకోవ‌డానికి ముందుకు రాని వారికి ఇటీవ‌ల ఫిలిప్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రీగో డుటెర్టే హెచ్చ‌రించారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించే వారిని ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న క్ర‌మంలో ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పదని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
చ‌ట్టంలో వ్యాక్సిన్ తీసుకోని వారిని ఇళ్ల నుంచి బయటకు రానీయకుండా ఏం లేద‌ని అయినా దీనిపై న్యాయస్థానాన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని రోద్రిగో పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోరా అయితే..మంచిద‌ని, మీరు ఎప్పుడైనా మరణిస్తారు అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.
   మరోవైపు ఫిలిప్పీన్స్ను వ్యాక్సిన్‌ కొరత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో  70 లక్షల మందికి  రెండు డోసుల టీకా ఇవ్వ‌గా.. 1.10 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు.
   వైరస్ కట్టడి కోసం ఎక్కువ మందికి వ్యాక్సిన్ తీసుకునేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది.  ఇప్పటికీ చాలా మంది టీకా మీద ఉన్న అనుమానం కారణంగా వ్యాక్సినేష‌న్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో అమెరికాలోని ప‌లు రాష్ట్రాలు టీకా తీసుకునేవారి కోసం ఆఫ‌ర్ల‌ను  ప్రకటిస్తున్నాయి. తాజాగా.. న్యూయార్క్ నగరంలో టీకా తీసుకున్న వాళ్ల‌కు వెయ్యి డాలర్లను అందిస్తామని ఆ రాష్ట్ర‌ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు న్యూయార్క్లో 99లక్షల టీకా డోసులు ఇచ్చామ‌ని మేయ‌ర్‌ డీ బ్లాసియో వెల్ల‌డించారు.
   అమెరికా సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తన మార్గదర్శకాలను సవర‌ణ చేసింది. టీకా తీసుకున్నవారికి మాస్కులు అవసరం లేదని గతంలో సూచించిన సీడీసీ, వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న చోట ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని మ‌ళ్లీ మార్గ‌ద‌ర్శకాల‌ను వెలువ‌రించింది.
    డెల్టా వైరస్ విజృంభణ తీవ్రమవుతున్న ప‌రిస్తితుల్లో.. అమెరికా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా చూపేలా నిబంధనలు తీసుకురావాలని అక్క‌డి ప్ర‌భుత్వం భావిస్తోంది. టీకా తీసుకున్నట్లు ఆధారాలు చూపించకపోతే.. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం లేదా మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసేలా ఆంక్షలు తీసుకురానుంది. ఈ మేరకు జో బైడెన్ సర్కారు విధాన నిర్ణయం తీసుకోనున్నట్లు  తెలుస్తోంది.ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీకా తప్పనిసరి నిబంధన తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
 భార‌తదేశంలో కూడా టీకాపై కేంద్ర‌ప్ర‌భుత్వం ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా దేశ పౌరుల‌కు క‌రోనా టీకా ఇవ్వాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: