ఎపిసోడ్ 1: ఇండియాలో ఆ రోడ్డు భూతల స్వర్గమే, ఎప్పుడైనా వెళ్ళారా...?

ఫోన్ చేతిలో ఉండి... బండి బాగా డ్రైవ్ వచ్చిన వాడిని నీ డ్రీం రైడ్ ఎంట్రా అంటే... లే లద్దాక్ రా మావా అంటాడు. యుట్యూబ్ లో వీడియోలు చూసి మరింత ఆసక్తి ఉంటది... నిత్యం వార్తలు చదివే నాకు... ఎప్పటి నుంచో అక్కడికి వెళ్లాలని కల... ఎప్పటి నుంచో తిరగాలని డ్రీం. డ్రీం కి టైం వచ్చింది... ఇల్లు కట్టేసుకున్నా... కాస్త సెటిల్ అయిపోయాను. ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్దాం అన్నారు. నాకు లద్ధాక్ తో పాటు గంగోత్రి, రిషికేశ్ చూడాలి... మనాలిలో తిరగాలి, ఆ మంచు కొండలు చూడాలని కోరిక.
డబ్బులు పోగేసుకుని బయల్దేరా... నాతో పాటు నలుగురు అనుకున్నా గాని చివరికి ఇద్దరం అయ్యాం. అక్కడికి వెళ్ళాక నేను ఒక్కడినే అయ్యా... కంగారు పడ్డాడు ఘాట్ రోడ్స్ చూసి... అందుకే నాతో వచ్చిన ఫ్రెండ్ డ్రాప్ అయ్యాడు. నేను ఒక్కడ్నే చండీఘర్ లో తీసుకున్న బండితో... హిమాచల్ బయల్దేరా... తను ధర్మశాల వరకు వచ్చాడు. పారాగ్లైడింగ్ చేసాం... ప్రపంచంలోనే ఎత్తైన పారాగ్లైడింగ్ స్పాట్ అది. దౌల్దార్ రేంజ్ అన్నమాట. పర్వతాలు చూస్తే చెమటలు కక్కే ప్లేస్ అది. ధైర్యంగా పైకి వెళ్లి ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టేసా.
ఆ తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకుని మనాలి బయల్దేరా... బహుశా నా దృష్టిలో భూతల స్వర్గం అంటే ఆ రోడ్డే. నేను చూసిన చిన్న ప్రపంచంలో... చాలా అందమైన రోడ్డది... చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టేసా. మూడు నాలుగు సార్లు... ఓకే. ఆ తర్వాత మనాలి వెళ్తూ బియాస్ నదిని చూసాను. అక్కడ నదిలో విహారానికి వస్తారా అంటూ కొందరు పడవలు పట్టుకుని పిలిచారు గాని ఆ నీళ్ళు అన్నీ మంచు కరిగిన నీళ్ళే. హిమాలయాల్లో నుంచి వస్తున్నాయి. అప్పటికే చలితో నా ప్రాణం పోతుంది.
మనసు లాగుతున్నా వద్దురా వెంకట్రామయ్యా అనుకుని కుల్లు నుంచి మనాలి ఆపకుండా కొట్టేసా. చెప్పడం మర్చిపోయాను... మండి దగ్గర నాకో పంజాబ్ ఫ్రెండ్ కలిసాడు. వాడు కొంచెం వింతగా ఉన్నాడు. స్పీతీ వ్యాలీ వెళ్దాం అన్నాడు. లేదు రా బాబు నేను లడఖ్ చూడాలి... నా లాగులు వేసుకునే వయసు నుంచే అది డ్రీం రా అన్నాను... అలా మనాలి వెళ్లాం... అక్కడికి వెళ్ళాక వాడికి తెలిసిన హోటల్ ఏదో తీసుకున్నాడు. హోటల్ బాగుంది... ఉదయం నుంచి అక్కడ ఉన్నాం... సాయంత్రానికి మేఘాలు పక్కకు జరిగి మంచు కొండలు కనపడుతున్నాయి.
నా లైఫ్ లో మొదటిసారి చూసాను మంచు కొండలు... అవి హిమాలయాలు కదా... పుస్తకాల్లో చూసి డైరెక్ట్ గా చూస్తుంటే నాలో చిన్న పిల్లాడు కనిపించాడు. ఎద్దులా ఉండి గంతులేస్తే బాగోదని నాకు తెలిసిన అందరికి లైవ్ పెట్టా... ఫొటోస్ తీసుకున్నాను కూడా. రైడ్ చాలా బాగుంది అని అందరికి చెప్పా. లడఖ్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని... ముందు కీర్ గంగా వెళ్దాం అన్నాడు అతను. నో నో నేను ట్రెక్కింగ్ చేయలేను రా బాబు అని చెప్పి... నేను వంద కేజీలు బరువు... రెండు మూడు సంచులు వేసుకుని ఎక్కడ ఎక్కుతాను... లేదు బ్రో... నువ్వు వెళ్ళమన్నాను...
నీతో పాటు లడఖ్ వస్తా అన్నాడు... రోడ్డు మీద కలిసిన వాడికి ఇంత వేల్యూ ఇస్తున్నాడు ఏంటీ అని భయపడ్డాను... నా మెడలో గొలుసు చేతికి ఉంగరం ఉన్నాయి మరి... అదేమో నార్త్. నేరాలు ఎక్కువగా జరిగే ప్లేస్, నా పర్సనాలిటీకి భయపడితే బాగోదని వాడిని వదిలించుకుని లడఖ్ వెళ్దాం అనుకున్నాను... కాని వాడు నన్ను ఎక్కడా వదల్లేదు. ఆ రోజు సాయంత్రం హోటల్ రిసెప్షన్ లో కుర్రాడు ఉంటే... భాయ్. పోస్ట్ పెయిడ్ సిమ్ నీడ్.. వీ ఆర్ గోయింగ్ టూ జియో షాప్ అన్ని వచ్చి రాని ఇంగ్లీష్ లో ఆడికి అర్ధమయ్యే విధంగా చెప్పి తీసుకెళ్లా... మిగతా భాగం రేపు చెప్తాను...
గుళ్ళపల్లి వెంకట్రామయ్య

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: