కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. రేసులో ముందున్నది వీళ్లే..!!

N.ANJI
కేంద్రం మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని నరేంద్రమోదీ ముహూర్తం ఖరారు చేశారు. అయితే బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇక కొత్తగా కేబినెట్‌ లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలతో మోదీ కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు పలువురు మంత్రుల పని తీరును కూడా బేరీజు వేసుకుని కేబినెట్‌ ను పునర్ వ్యవస్థీకరించాలని మోదీ భావిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే పలువురు నేతలకు కేంద్ర కేబినెట్‌లో చోటు దాదాపుగా ఖాయమైందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే  
మధ్య ప్రదేశ్ నుండి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా, అసోం మాజీ సీఎం శర్బానంద సోనోవాల్, అనుప్రియా పటేల్,  పశుపతినాథ్ పరాస్, ఆర్సీపీ సింగ్, లలన్ సింగ్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, నిషిత్ ప్రమాణిక్, శంతను ఠాకూర్, నారాయణస్వామి, కపిల్ పాటిల్, చంద్ర ప్రకాష్ జోషి, రామశంకర్ కథేరియా, వైజయంత్ పాండా, వరుణ్ గాంధీ, రీటా బహుగుణ జోషి కేబినెట్ రేసులో ముందు ఉన్నట్లు తెలుస్తుంది,
అంతేకాదు.. వీరితో పాటు ఇతర నేతల పేర్లను కూడా ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే మరోవైపు కేబినెట్ విస్తరణ షెడ్యూల్డ్ కులాలకు చెందిన నాయకులకు ఎక్కువగా ప్రాతినిథ్యం లభించే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలియజేశాయి. ఇక వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన 24 మంది నేతలను కేబినెట్‌లోకి తీసుకుంటారని సమాచారం. అంతేకాక.. కేబినెట్ విస్తరణ సందర్భంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో కంటే ఎక్కువగా మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని బీజేపీ పెద్దలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: