ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లే టార్గెట్‌గా కేంద్ర కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌.. కొత్త మంత్రులు లిస్ట్‌..!

VUYYURU SUBHASH
కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమయ్యినట్టు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయ‌నున్నారు. నెల రోజులుగా మంత్రి వ‌ర్గ కూర్పుపై మోడీ సుధీర్ఘంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇద్ద‌రు మంత్రులు చ‌నిపోయారు. శివ‌సేన‌, అకాళీద‌ల్ ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాయి. ఇక 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు వ‌చ్చే యేడాది జ‌రిగే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కేబినెట్‌ను విస్త‌రించ‌నున్న‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు, బీజేపీ వ‌ర్గాలు చెపుతున్నాయి.
వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నిక‌లే టార్గెట్‌గా ఈ కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే 27 మంది కొత్త కేంద్ర మంత్రుల పేర్లు కూడా ప‌రిశీలించిన‌ట్టు చెపుతున్నారు. ఎంపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలో చేపట్టడంలో కీ రోల్ పోషించిన జోతిరాదిత్య సింథియాకు కేబినెట్ ప‌క్కా..! బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ, అసోం, మహారాష్ట్ర మాజీ సీఎంలు శర్వానంద సోనోవాల్‌, నారాయణ రాణెలకు కూడా కేబినెట్ ఖాయ‌మే అని టాక్‌.
యూపీ బీజేపీ అధ్య‌క్షుడు, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లామ్, అప్నాదల్‌ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్‌, ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్ లేదా అనిల్ బలౌనీ, కర్ణాటక నుంచి ప్రతాప్ సింహా పేర్లు తెర‌మీద‌కు వస్తున్నాయి. పూనమ్ మహాజన్ లేదా ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర), పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ)లకు చోటు దక్కు అవకాశం ఉంద‌ని అంటున్నారు. నిబంధనల ప్రకారం కేబినెట్‌లో 81 మంది మంత్రులు ఉంటారు.
ప్రస్తుతం 53 మంది ఉండటంతో తాజా మంత్రివర్గ విస్తరణలో 28 మంది వరకు నియమించే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా వ‌చ్చే యేడాది జ‌రిగే ఐదు రాష్ట్రాల్లో పార్టీ గెలుపే ల‌క్ష్యంగా మోడీ కేంద్ర కేబినెట్‌లో మార్పులు .. చేర్పులు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: