జులై 1నుండి విమానాలు బంద్..!

NAGARJUNA NAKKA
బ్రిటన్ లో కరోనా డెల్టా వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందున్నాయి. దీంతో ఆ దేశాన్ని అత్యంత ప్రమాదకమైందని భావించింది హాంకాంగ్. డెల్టావేరియంట్ ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుండి వచ్చే అన్ని విమానాలను రద్దు చేసేలా నిర్ణయం తీసుకుంది. జులై 1నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.  
హాంకాంగ్ లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ లో రెండు గంటలకు పైగా గడిపిన ఏ వ్యక్తులను హాంకాంగ్ విమానాలు ఎక్కేందుకు అనుమతించరు. యూకేలో కరోనా మహమ్మారి ఇటీవల తన ప్రతాపం చూపిస్తోంది. బ్రిటన్ లో అధిక శాతం కరోనా  వ్యాక్సిన్లు ఇస్తున్నప్పటికీ.. కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అక్కడి వారిలో వచ్చే వ్యాధుల్లో చాలా వరకు డెల్టావేరియంట్ తో సంబంధం కలిగి ఉండటం ఆందోళ కలిగిస్తోంది. హాంకాంగ్ లో తొలిసారిగా డెల్టావేరియంట్ కేసును గత గురువారం గుర్తించారు. హాంగాంగ్ దేశం ఇతర దేశాలతో సరిహద్దులను పంచుకొని ఉంది. దీంతో తమదేశంలోని డెల్టా వేరియంట్ కేసులు ఎంటర్ కాకుండా జాగ్రత్తపడుతోంది. యూకే నుండి వచ్చే వారిలో ఎక్కువ శాతం డెల్టావేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నట్టు హాంకాంగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో బ్రిటన్ నుంచి ఎవరూ రాకుండా జులై 1నుండి విమాన రాకపోకలను నిషేధిస్తోంది. హాంకాంగ్ ఇప్పటికే ఇండియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల నుండి నుండి విమాన రాకపోకలపై ఆంక్షలు విధించింది.  
లండన్ వీసా విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత హాంకాంగ్.. యూకే మధ్య ఉద్రిక్తత ఉంది. ఈ  వీసా విధానంతో హాంకాంగ్ నుండి మిలియన్ల మందికి  యూకేలో నివసించడానికి.. పని చేయడానికి ఎక్కువ అవకాశాలను కల్పించింది.  అంతేకాదు బ్రిటిష్ పౌరసత్వానికి ఒక మార్గాన్ని అందిస్తోంది.

థర్డ్ వేవ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సెకండ్ వేవ్ ఇప్పటికే అన్ని దేశాలను ప్రమాదంలోకి నెట్టింది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే. సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: