నా యాక్షన్ ప్లాన్ వేరే ఉంది.. !

Chaganti
తెలంగాణలో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెస్తామని కొత్త పీసీసీ ఛీఫ్ గా ఎంపికయిన రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడుగు..బలహీన వర్గాల కోసం, అమర వీరుల ఆశయాల కోసం, రాహుల్..సోనియా గాంధీ ఆలోచనల మేరకు పని చేసి సత్తా చాటుతామని అన్నారు.  కాంగ్రెస్ అంటే కార్యకర్తల పార్టీ అని నిరూపిస్తానన్న ఆయన,  సీనియర్ల అందరినీ కలుస్తామని  అందరి అభిప్రాయాలు తీసుకుని పని చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో నిరుద్యోగుల కోసం పని చేస్తామని చెప్పిన ఆయన అందరితో కలిసి పనిచేసి నిన్నమొన్న వరకు అభిప్రాయభేదాలు ఉన్న వారిని కూడా కలుపుకుపోతాం అని అన్నారు. 


రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది సాధారణం అని భిన్నాభిప్రాయాలు మాత్రమే కానీ భేదాభిప్రాయాలు కావు అని చెప్పుకొచ్చారు.. కుటుంబం అన్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయని అందరం కలిసి పోరాటం చేస్తాం అందరినీ కలుపుకునే వెళ్తాను అని చెప్పుకొచ్చారు. 



తన వద్ద మంచి యాక్షన్ ప్లాన్ ఉందని ఆ యాక్షన్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి లాంటి సీనియర్లను కలిసి వారితో కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఎవరికీ ఇబ్బంది ఉండదని పేర్కొన్న ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ మా కుటుంబమేనని ఆయన చెప్పుకొచ్చారు. రాజీనామా చేసిన కేఎల్లార్ తో కూడా మాట్లాడతాను అని కొన్ని ఒడిదుడుకులు ఉన్నా సర్దుకుపోతామని అన్నారు. అసలు తనకు ఎంపీ సీటు ఇవ్వాలని కోరింది కేఎల్లార్ కాబట్టి అందరితో కలిసి చర్చించి పనిచేస్తామని అన్నారు. అలాగే ఈటెలను బీజేపీలోకి పంపింది కేసీఆర్ అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ప్రైవేట్ చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళిన ఈటెల ఫ్లైట్ ఎవరిదో చెప్పాలని అన్నారు.. ఆ ఫ్లైట్ ఒక కాంట్రాక్టర్ ది కాగా ఆ కాంట్రాక్టర్ కు కేసీఆర్ కు ఉన్న బంధం ఏంటో తేలాలని రేవంత్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: