కరోనా పంజా విసిరింది.. మృగరాజు మూగబోయింది?

praveen
మొదటి దశ కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ ఊహించనంత నష్టాన్ని కలిగిస్తుంది.  వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది పై పంజా విసురుతుంది. అంతే కాదు ఎంతోమంది ప్రాణాలను సైతం బలితీసుకుంది ఈ మహమ్మారి.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యేలోపే చేయాల్సిన నష్టాన్ని మొత్తం చేసేసింది.  చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి పై కన్నెర్ర చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే మొన్నటి వరకు వైరస్ కేసుల సంఖ్య దేశంలో ప్రమాదకర రీతిలో పెరిగిపోయాయి. పలు రాష్ట్రాలలో అయితే విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.

 ఈ క్రమంలోనే దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ విధించి కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నారూ.  ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో  వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే  శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ కేవలం మనుషుల ప్రాణాలు తీయడమే కాదు.. అటు మూగజీవాలను కూడా వదలడంలేదు.  ఇప్పటికే పలు జూలాజికల్ పార్క్ లలో పులులు, సింహాలు కరోనా వైరస్ బారిన పడినట్లుగా అధికారులు గుర్తించారు.  ఇక వాటికి ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు.


 కానీ ఇటీవల తమిళ నాడు లోని ఒక జూ పార్క్ లో సింహం  వైరస్ బారినపడి మృతి చెందింది. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. ఇటీవలే కరోనా వైరస్ దెబ్బకి అటు మృగరాజు సైతం మూగబోయి ప్రాణాలు వదిలింది. తమిళనాడు రాష్ట్రం వండలూరు లోని అరైనార్ అన్నా జూలాజికల్ పార్కులో ఇటీవలే మరో సింహం కరోనా వైరస్ బారినపడి మృతి చెందింది. జూలోని మగ సింహం పద్మనాభం వయసు 12 ఏళ్ళు.  కొన్ని రోజుల నుంచి కరోనా వైరస్ తో బాధ పడుతుంది సింహం. చివరికి పరిస్థితి విషమించి ఇటీవలే ప్రాణాలు వదిలింది. ఈ సింహం మృతితో జూలాజికల్ పార్క్ లో మృతి చెందిన సింహాల సంఖ్య రెండుకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: