కరోనా తగ్గుతోంది.. కానీ రేపిస్టులే?

praveen
దేశంలో కరోనా వైరస్ ఎంతో మంది పై పంజా విసురుతుంది.. ప్రాణాలను సైతం తీస్తుంది. ఈ క్రమంలోనే ఇక ప్రజలందరూ మనోధైర్యంతో వైరస్ బారిన పడినప్పటికీ చివరికి ఈ మహమ్మారిని జయిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు  వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నాయ్. వెరసి రోజు రోజుకూ  వైరస్ కేసుల సంఖ్య తగ్గుతుంది. కానీ మానవ మృగాల ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.  రోజు రోజుకు రెచ్చిపోతున్న రేపిస్టులు కరోనా కంటే దారుణంగా మనుషులపై దాడులు చేస్తు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  ఇక ఇటీవల అసోం లో జరిగిన ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.

 కరోనా వైరస్ బారిన పడిన మహిళ మనోధైర్యంతో వైరస్ను  జయించింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి బయలుదేరింది. కానీ మానవ మృగాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం ఊహించలేకపోయింది సదరు మహిళ. ఇంటికి నడుస్తూ వెళ్ళి పోతూ ఉంటే ఆమె పై దారిలో అత్యాచారం జరిగింది. ఈ ఘటన మే 27వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా ఇక ఆటో కి డబ్బులు పెట్టుకునే స్తోమత  లేకపోవడంతో చివరికి నడుచుకుంటూ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి బయల్దేరారు. దారిలో చీకటి పడింది అంతలో ఇద్దరు వ్యక్తులు వెంటపడి అత్యాచారం చేయబోయారు. దీంతో యువతి అయినా కూతురు తప్పించుకుంది చివరికి 51 ఏళ్ళ తల్లి మానవ మృగాల  చేతిలో బలయ్యింది.

 తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని అందరూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా బయట పడిన వారికి అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం ప్రస్తుతం దుమారం రేగుతోంది. కరోనా వైరస్ బారిన పడి పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన వారు 30 కిలోమీటర్లు నడుస్తూ వెళ్తారని ఇక ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: