శభాష్ ఎన్టీఆర్ ట్రస్ట్.. గొప్ప నిర్ణయానికి చేతిలెత్తి మొక్కాల్సిందే?

praveen
కరోనా వైరస్ సెకండ్ పై ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏపీలో అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం కారణంగా పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి అధ్వానంగా మారిపోతుంది. కనీసం  తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి సమయంలో ఇక పేద, మధ్యతరగతి కుటుంబం లోని ఒక వ్యక్తి  వైరస్ బారిన పడ్డాడంటే మందులు కొనేందుకు సరైన ఆహారం తీసుకునేందుకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ఇలాంటి నేపథ్యంలో ఎంతోమంది తమ గొప్ప మనసు చాటుకుంటూ  వైరస్ బారిన పడుతున్న నిరుపేదలు అందరికీ అండగా నిలబడి  చేయూతనిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులు..  స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు వచ్చి పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా గత కొన్ని రోజుల నుంచి కరోనా క్లిష్ట సమయంలో ఎంతో మంది బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మందుల పంపిణీ, ఆహారం పంపిణీ లాంటి కార్యక్రమాలతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు లాంటివి కూడా చేపట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇక ఇప్పుడు మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టింది.

 ప్రస్తుతం కరోనా సమయంలో మానవ  బంధాలకు విలువ లేకుండా పోతుంది ఏకంగా కరోనా వైరస్ బారినపడి చనిపోతే ఏకంగా కుటుంబీకులు సైతం  మృతదేహాలను వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా.. ఎన్నో అనాధ శవాలు కూడా ఆసుపత్రిలో అలాగే ఉండిపోతున్నాయి. ఇలా ఎవరూ లేని అనాధ శవాలకు ఏకంగా అంతిమ సంస్కారం నిర్వహించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధమయింది. ఇలా సొంత వాళ్లే ఏకంగా వైరస్ బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను వదిలేస్తున్న సమయంలో ఒక గొప్ప ఆలోచన చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఈ విషయాన్ని నారా భువనేశ్వరి వెల్లడించారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: