ఐసీయూ బెడ్‌మీద తాళి క‌ట్టిన యువ‌కుడు కానీ చివ‌ర‌కు..?

Suma Kallamadi
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, ఎన్ని కుటుంబాలు రోడ్డుపాలు అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు కరోనా వైరస్ సోకిందని తెలిసేలోపే.. కొన్ని కొన్ని సార్లు మనిషి కోలుకోలేక చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎన్నో చూసాము. ఇలాంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు పొందే బాధను వర్ణించడానికి వీలు లేకుండా పోయింది. అసలు విషయంలోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ ఘటన అందర్నీ కన్నీరు పెట్టేలా చేస్తోంది. కేవలం 27 ఏళ్ల ఓ మహిళ మంచి జాబ్ చేస్తూ తనని ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తిని ఇంట్లో ఒప్పించి ఈ ఏడాది చివరన పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవించాలి అనుకుంది. కాకపోతే కరోనా మహమ్మారి ఆమె ఆశయాన్ని అడియాసలు చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఆవిడ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయిని గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న యువకుడు కాపాడుకునేందుకు శతవిధాల ధైర్యం చెబుతూ.., ఆమెను కాపాడుకోవడానికే విశ్వప్రయత్నం చేశాడు. అయితే విధి వక్రీకరించడం తో ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణించింది.

ఈ సమయంలోనే డాక్టర్ల అనుమతితో ఆ యువకుడు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న యువతితో మాట్లాడుతూ.. నీకు ఏం కాదు నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు. అందరూ మెచ్చుకునేలా మన జీవితాన్ని మొదలు పెడదాము అని భరోసా ఇవ్వడమే కాకుండా.., అదే సమయంలో ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న బెడ్ పైన ఆ యువతి మెడలో తాళి కట్టి ఇకపై నేను ఆ అమ్మాయికి కొండంత భరోసా ఇచ్చాడు. కానీ కరోనా మహమ్మారి ముందు ఏవి పని చేయలేదు. వెంటిలేటర్ పై ఉన్న ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యువుతో నిరవధికంగా పోరాడి చివరికి తుది శ్వాస విడిచింది. దాంతో చివరకు ఆ అమ్మాయి తమ్ముడు, అలాగే తాళి కట్టిన యువకుడు దగ్గరుండి ఆవిడకు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఆ అమ్మాయి మరణించిన విషయం మాత్రం ఆవిడ తల్లిదండ్రులకు చెప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: