ఆనందయ్య మందుపై టాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు..?

Suma Kallamadi
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆనందయ్య కోవిడ్-19 వ్యాధికి అద్భుతమైన దివ్యౌషధం తయారు చేస్తున్నారని.. ఆయన మందు కంటిలో వేసుకోగానే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని.. చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగి కూడా ఆనందయ్య మందు తీసుకోగానే లేచి కూర్చున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన మందు తీసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా బారులు తీరడం.. ఒకానొక సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించడం వంటి ఘటనలు వెలుగు చూడటంతో అతని మందు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపివేసింది. అంతేకాకుండా ఆనందయ్య మందు కరోనా చికిత్సలో సమర్ధవంతంగా పని చేస్తుందా? పని చేయదా? అనే విషయాన్ని తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.
ఇదిలా ఉండగా ఆనందయ్య మందు సమర్థతపై అల్లోపతి డాక్టర్లు, నెటిజన్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య మందుపై అధ్యయనం చేసే అధికారులు సైతం వ్యక్తిగతంగా (అధికారికంగా కాకుండా) సానుకూలమైన అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. వారంతా కూడా ఆనందయ్య మందును తాము సిఫార్సు చేస్తామని చెప్పడం విశేషం. కాగా.. సెలబ్రిటీలు ఆనందయ్య మందు కరోనా మహమ్మారి చికిత్సకు సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధం గా ఆమోదం పొందాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే సీనియర్ టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆనందయ్య మందు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మ‌న‌ల్ని రక్షించడానికి ప్రకృతి ముందుకొచ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఆనంద‌య్య గారి థెరపీ ప్రామాణికంగా ఆమోదం పొంది, ప్ర‌పంచాన్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాను. అత‌డిని దేవుడు ఆశీర్వ‌దించాలి’ అని జ‌గ‌ప‌తిబాబు ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం జగపతిబాబు ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ కింద నెటిజన్లు మెడికల్ మాఫియా కారణంగా ఆనందయ్య మందు ఆమోదం పొందే విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆనందయ్య మందు పంపిణీ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు కాగా.. హైకోర్టు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: