వాళ్ళ ఉసురు తగలకపోదు: శపించిన బండి సంజయ్

Gullapally Rajesh
సీఎం కేసీఆర్ కు రైతుల ఉసురు తగులుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నెల రోజుల నుండి ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు ఆగిపోయింది అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరు  అని ఆయన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేకపోయినా సరే కేసీఆర్ సంతోషంగా ఉంటారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతులకు అన్ని సమస్యలే  అని ఆవేదన వ్యక్తం చేసారు. తాలు తరుగు హమాలి పేరుతో రైతులను దోచుకుంటున్నారు  అని మండిపడ్డారు.
రైతుల ఇబ్బందుల పైన సీఎం కేసీఆర్ ఎక్కడికైనా పర్యటించారా  అని నిలదీశారు. ఐకేపీ సెంటర్ లో రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రేపో మాపో రోహిణి కార్తీ వస్తుంది  అని ఇప్పటికె పంట కొనుగోలు కాకా రైతులు ఆవేదన చెందుతున్నారు  అని బండి సంజయ్ అన్నారు. పంట అమ్ముకోవాలా మళ్ళీ పంటలు వేసుకోవాలా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది  అని బండి ఆవేదన వ్యక్తం చేసారు. టి ఆర్ ఎస్ నేతలు బ్రోకర్లు గా మారారు అని ఆయన మండిపడ్డారు.
తాలు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అని విమర్శలు చేసారు. రైతుల దృష్టి మళ్లించడానికే సీఎం కేసీఆర్ హాస్పిటల్స్ పర్యటన చేశారు  అని అన్నారు. హాస్పిటల్ పర్యటన చేసిన కేసీఆర్ చేసింది ఏమిటి  అని ఆయన నిలదీశారు. యుద్ధప్రాతిపతికన కొనుగోలు చేయాలి  అని డిమాండ్ చేసారు. తడిసిన ధన్యాని కొనుగోలు చేయాలి అని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతులకు డబ్బులు చెల్లించాలి అని అన్నారు. తాలు తరుగు హమాలి పేరు మీద రైతులను ఇబ్బందులు పెట్టవద్దు  అని కోరారు. రైతు బంధు వెంటనే ఇవ్వలి వెంటనే రుణమాఫీ చేయాలి అని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: