రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

Satya
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు ఎపిసోడ్ లో ప్రస్తుతానికి కధ సుఖాంతం అయింది. వారం రోజుల పాటు వేడిగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో అనేక ట్విస్టులు దాటి ఎట్టకేలకు రాజు బెయిల్ తెచ్చుకున్నారు. ఆయనకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
అయితే రఘురామ క్రిష్ణం రాజుకు బెయిల్ రావడం అంటే ఒక విధంగా ప్రభుత్వం తగ్గాల్సి వచ్చిందా అన్న చర్చ వస్తోంది. అయితే రాజు అరెస్ట్ విషయంలో చేసిన కొన్ని పొరపాట్లే చివరికి ఆయన జైలు గోడలకు చేరకుండా బెయిల్ దారి చూసుకునేలా చేశాయని అంటున్నారు. సరిగ్గా గత శుక్రవారం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న రాజుని ఆయన ఇంటి వద్దనే అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు.
ఇది ఆయనకు సానుభూతిని కలిగించే విషయం అయి కూర్చుకుంది. ఆ మీదట హడావుడి ఒక్క లెక్కన చేశారు. ఆయన్ని ఆ రోజు రాత్రి ఎక్కువ సేపు ఆయన్ని విచారించారని ప్రచారం జరిగింది. ఇక రాజు విషయంలో కేవలం అతి చేశారు తప్ప పక్కా ప్లాన్ తో వెళ్ళలేదన్న మాట అయితే ఉంది. ఆయన విషయంలో సీఐడీ చేసిన దూకుడు కు ప్రభుత్వం ఇపుడు ఇబ్బంది పడేలా ఉందని అంటున్నారు.
మరో వైపు ఆయన మీద పెట్టిన కేసులలో రాజద్రోహం కేసు కూడా వివాదాస్పదమైంది. అది నిలవదు అని తెలిసినా అతి ఉత్సాహంతో పెట్టారా అన్న మాట అయితే ఉంది. అంటే ఆయన మీద కక్ష సాధింపు అన్నది కనిపించేలా ఉందని కూడా అంటున్నారు. ఇక ఆయన కాలికి గాయాలు అయ్యాయని  పోలీసులు కొట్టారు అన్న పాయింట్ హైలెట్ అయింది. ఆ విషయంలోనే ఒక్క సారిగా ప్రభుత్వం ఇరుకునపడిపోయినట్లు అయింది. దాంతోనే రాజుకు  బెయిల్ మంజూరు కూడా అయింది. మొత్తానికి రాజు ఎపిసోడ్ చూస్తే ఆయన మీడియా ముఖంగా ఎన్ని అనాలో అన్నీ అన్నా కూడా ఆయన మీద సరైన తీరులో చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వం అభాసు కావాల్సివచ్చింది అన్నదే అందరి మాటగా ఉందిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: