అచ్చెన్న డిమాండ్ మాములుగా లేదుగా బ్రో...?

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం దాలుస్తుందని అన్నారు. కరోనా నియంత్రణ చర్యలు మాని జగన్ రాజకీయ ప్రత్యర్థులపై కక్షతీర్చుకునే పనిలో నిమగ్నం కావడం విచారకరం అని ఆయన ఆరోపించారు. అనంతపురంలో జిల్లాస్థాయి అధికారి సుబ్బరాయుడు ఆక్సిజన్ అందక మృతిచెందడం బాధాకరం అని ఈ సందర్భంగా మండిపడ్డారు. సుబ్బారాయుడు కొడుకు తండ్రిని భుజాన వేసుకెళ్లి బెడ్ కోసం వేడుకున్నా కనికరించలేదు అని అన్నారు.
రాష్ట్రంలో చాపకింద నీరులా బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధిసోకి ఇప్పటికే అయిదుగురు మృతిచెందారు అని వెల్లడించారు. ఈ వ్యాధి చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రిలో రూ.10లక్షలు అవుతుందని చెబుతున్నారు అని అన్నారు. పూర్తిగా ప్రభుత్వమే భరించి వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలి అని ఆయన కోరారు. ఇప్పటికీ రాష్ట్రంలో సరిపడా ఆక్సిజన్ సరఫరా లేదు అని ఈ సందర్భంగా విమర్శలు చేసారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కూర్చుని ప్రధానికి లేఖలు రాయడం వల్ల ప్రయోజనం లేదు అని అన్నారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మృతిచెందిన వారి జాబితా టిడిపి విడుదల చేసింది అని దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. రాష్ట్రప్రభుత్వ చేతగానితనంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ అధ్వాన్నంగా తయారైంది అని మండిపడ్డారు. తొలిడోసు వ్యాక్సిన్ ఇచ్చిన వారికి రెండో డోసు ఇవ్వడం లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు పక్కన బెట్టి కరోనాపై దృష్టి సారించాలి అని విజ్ఞప్తి చేసారు. కోవిద్ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల రూపాయలు అందజేయాలి అని కోరారు. ఆక్సిజన్ అందక మృతిచెందిన కుటుంబాలకు రూ.25లక్షల రూపాయలు అందజేయాలి అని డిమాండ్ చేసారు. అచ్చెన్న డిమాండ్ ప్రకారం కరోనాతో మరణించిన వాళ్ళకు ప్రతీ ఒక్కరికి 10 లక్షలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: