ఆన్ లైన్ లో శుభకార్యాలు..!?

Suma Kallamadi
కరోనా కారణంగా వివిధ రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. బయటకు వెళ్లకుండా ఆంక్షలను విధిస్తున్నారు. కరోనా వల్ల వివిధ కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. మరికొన్ని పూర్తిగా ఆగిపోతున్నారు. పెళ్లిల్లు కూడా అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించుకోవాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. ఈ తరుణంలో చాలా మంది ఆన్ లైన్ లో కార్యక్రమాలు కానిచ్చేస్తున్నారు. శుభకార్యాలనూ ఆన్‌లైన్‌లోనే చేసేసుకోవడం ప్రస్తుతం సాంప్రదాయంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్‌కు చెందిన దంపతులకు ఆరునెలల క్రితం కూతురు పుట్టింది. చిన్నారికి గత శుక్రవారం అన్నప్రాశన చేయించేందుకు తల్లిదండ్రులు తెలిసిన పూజారిని అంతకు రెండు రోజుల క్రితం సంప్రదించారు. ఇంటికి వచ్చి అన్నప్రాశన చేయించాలని కోరగా కరోనా తీవ్రత కారణంగా తాను బయటకు వెళ్లడంలేదని, కావాలంటే వీడియో కాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పారు. దీంతో దంపతులు ఆన్‌లైన్‌ పూజకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ దంపతులు ఇంట్లో పీటలపై కూర్చుని చిన్నారిని ఒడిలో పట్టుకోగా కుటుంబ సభ్యులు పూజారి సెల్‌కు వీడియోకాల్‌ చేశారు.
దీంతో ఆయన ఆన్‌లైన్‌లో చెబుతున్న మంత్రాలను వారు పఠించారు. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తర్వాత ఫోన్‌పేలో పూజారికి డబ్బులు పంపించారు. చాలామంది తమ ఇళ్లలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, అన్నప్రాశన లాంటి కార్యక్రమాలను నిరాడంబరంగా పూర్తి చేసుకుంటున్నారు. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులతో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు.  కరోనా వల్ల కొంతమంది పెళ్లిళ్లను వాయిదా వేసుకోగా, మరికొంత మంది తక్కువ మందితో శుభకార్యాలను పూర్తి చేసుకుంటున్నారు. అయితే పలుచోట్ల ఒకరిద్దరు పూజారులు మాస్కులు, ఫేస్‌షీల్డులు, చేతులకు గ్లౌజులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రత్యక్షంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ 90% మంది ఇంటినుంచే వీడియోకాల్‌ ద్వారా చేస్తున్నారు. పూజారులు కూడా ముహూర్త సమయానికి గంట ముందు కాల్‌ చేస్తే తాము వీడియోకాల్‌లో సిద్ధంగా ఉంటామని చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే ఆనవాయతీగా మారుతోంది. ఇంకేం చేస్తాం కరోనా వల్ల తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: