జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద ప్రభావం... ?

Satya
రఘురామ క్రిష్ణం రాజు వైసీపీకి కొరుకుడు పడడంలేదు. పార్టీ ద్వారా టికెట్ పొంది ఆ మీదట గెలిచిన ఆయన రెబెల్ గా జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి రాజు రచ్చ బండ పేరుతో ఢిల్లీలో కూర్చుని ప్రతీ రోజూ ప్రెస్ మీట్లతో వైసీపీకి గట్టి షాకులు ఇస్తూనే ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ అంటే జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయమంటూ సీబీఐ కోర్టులో రాజు పిటిషన్ దాఖలు చేయడం.
దానికి కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. అటు జగన్ కి ఇటు సీబీఐ కి కూడా  సీబీఐ కోర్టు దీని మీద కౌటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 7న ఈ కేసు విచారణకు వచ్చినపుడు కౌంటర్ కి మరింతకాలం గడువు కావాలని వారు కోరారు. దాంతో ఈ కేసు ఈ నెల 17కి వాయిదా పడింది. ఈ నేపధ్యంలో అనూహ్యంగా రాజు అరెస్ట్ జరిగింది.
దీని మీదనే టీడీపీ ఇపుడు పెద్ద గొంతు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అయితే జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ రాజు సీబీఐ కోర్టులో కేసు వేశారు కాబట్టే ఆయన్ని అరెస్ట్ చేశారు అంటూ విమర్శించారు. టీడీపీకి చెందిన మరో నేత వర్ల రామయ్య కూడా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేశారు కాబట్టే కక్షతో అరెస్ట్ చేశారు అంటున్నారు. మొత్తానికి తమ్ముళ్ల వాదన ఏంటి అంటే బెయిల్ మీద ఉంటూ జగన్ ఇలా బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు అని.
మరి ఇదే విషయాన్ని రాజు తరఫున న్యాయవాదులు రేపటి రోజున విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు ముందుకు తీసుకువస్తారా అన్నదే చర్చ. అదే జరిగితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఆసక్తికలిగించే పరిణామం అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే రాంగ్ టైమ్ లో రాజు అరెస్ట్ జరిగిందా అన్న చర్చ అయితే ఉందిపుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: