తిరుపతి ఉప ఎన్నికలు : బాబు సహా నేతలందరికీ కరోనా టెన్షన్ !

Chaganti
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కచ్చితంగా తామే గెలుస్తామని చెబుతున్న అధికార పార్టీ కేవలం మెజార్టీ కోసం కష్టపడుతున్నామని చెబుతోంది. అయితే చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు అందరూ తిరుపతిలో మోహరించి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సహా టీడీపీ నేతలలో కరోనా టెన్షన్ మొదలైంది అని సమాచారం. నిజానికి ఈ నెల ఎనిమిదో తేదీ తిరుపతి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి నుంచి చంద్రబాబు ఎన్నికల పర్యటన మొదలు పెట్టారు. 
అయితే ఎన్నికల పర్యటన మొదలు పెట్టిన సమయంలో ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఆ సభలో ఆయన పక్కనే సన్నిహితంగా మాస్కులు లేకుండా మెలిగిన gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డికి నిన్న సాయంత్రం కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే అప్పటి నుంచి సుధీర్ కుమార్ రెడ్డితో మెలిగిన అందరితో టెన్షన్ నెలకొంది. ఇక చంద్రబాబు సహా టీడీపీ నేతలు కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరోపక్క ఎన్నికలు దగ్గరికి వచ్చేశాయి.
ఈ నెల 17వ తారీఖున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్వరలో ఎన్నికల ప్రచారం కూడా ముగియనుంది. ఇక ఈ రోజు సాయంత్రం బీజేపీ భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొననున్నారు. నిజానికి ఇదే సభకు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాల్సి ఉన్నా ఆయన నిన్నటి నుంచి క్వారంటైన్ లోకి వెళ్లిపోవడంతో ఈ సభకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. ఇక తాను సభ పెడితే వేలాది మంది వస్తారు అని అందుకే సభను రద్దు చేసుకుంటున్నారని వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగుదేశం లో మాత్రం కరోనా టెన్షన్ ప్రారంభమైందని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: