మేము కాదు అసలు దోషి అమెరికా.. హాట్ టాపిక్ గా మారిన చైనా కంప్లైంట్..?

praveen
కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి అసలు కారణం చైనా అన్న విషయం ప్రపంచ దేశాలకు తెలుసు.  కానీ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి లాగా తమ దేశానికి అసలు కరోనా వైరస్ కి ఎలాంటి సంబంధం లేదు అంటు మొదటి నుంచి డబుల్ గేమ్ ఆడుతూ వస్తుంది చైనా. అంతేకాదు కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది అన్న విషయాన్ని కూడా దాచిపెట్టి ప్రపంచ వినాశనానికి  ప్రయత్నించింది చైనా. అయితే ప్రపంచ దేశాలు శరవేగంగా ఈ వైరస్ గురించి తెలుసుకొని అప్రమత్తం అయ్యాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. అదే సమయంలో  వైరస్ గురించి అన్ని విషయాలు తెలిసిన చైనా మాత్రం ఆర్థికంగా ఎంతగానో పుంజుకుంది అని చెప్పాలి.

 అయితే కరోనా వైరస్ గురించి ఇప్పటికి కూడా తమ దేశానికి చెందినది అనే విషయాన్ని చైనా ఒప్పుకోవడం లేదు. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ గురించి ఇతర దేశాలను దోషులుగా చూపడానికి ప్రయత్నిస్తూ ఉంది. గతంలో భారత్ లేదా బంగ్లాదేశ్లో మొదట కరోనా వైరస్ పుట్టుక జరిగింది అంటూ చైనా చెప్పింది.  అయితే చైనా ఇలా చెప్పడంతో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే ఇటీవల చైనా  ఏకంగా అగ్రరాజ్యమైన అమెరిక కరోనా వైరస్ కు దోషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికాకు పై కంప్లైంట్ చేసేందుకు సిద్ధం అయింది చైనా.

 ఇది కాస్త ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై అటు విశ్లేషకులు మాత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తికి పూర్తి కారణం చైనా అన్న విషయం ప్రపంచదేశాలకు తెలిసినప్పటికీ చైనా ఇప్పటికి కూడా తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దొంగే దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తుంది అని ఆశ్లేషకులు అంటున్నారు. అమెరికాలోని ల్యాబ్లోనే కరోనా వైరస్ పుట్టింది అని చెప్పడం నిజంగా విడ్డూరమే అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: