పది పాస్ కాలేదు.. దోచుకోవడంలో యమ కిలాడీలు..

Satvika
పది కూడా పాస్ అవ్వని చాలా మంది ఇప్పుడు నేరా ల్లో కీలక ముద్దాయిలుగా ఉన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలను చేస్తున్నారు. ఈ నేరగాళ్లకు అడ్డాగా జార్ఖండ్‌, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఉండగా.. తాజాగా బిహార్‌లోని కొన్ని జిల్లాలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి. జార్ఖండ్‌లోని జామ్‌తారా, దేవఘర్‌, రాంచీ , రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌తో పాటు బిహార్‌లోని నలంద, గయా, బిహార్‌షరీఫ్‌, షేక్‌పురా జిల్లాల్లో సైబర్‌నేరగాళ్లు పాతుకుపోయారు. స్థానికంగా ఎలాంటి నేరాలు చేయకుండా.. ఇతర ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకొని సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు.

అయితే.. దేశ వ్యాప్తంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న వారికి అంతంత మాత్రం చదవులే.. 10వ తరగతి కూడా పాసై లేరు అని తెలుస్తుంది. కానీ వీళ్ళ ముందు సైంటిస్టులు కూడా బలాదూర్ అనే చెప్పాలి.ముఖ్యంగా కేవైసీ అప్‌డేట్‌ చేయాలని, కార్డు బ్లాక్‌ అవుతుందని, ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌, క్వికర్‌, క్యూఆర్‌ కోడ్‌, కస్టమర్‌ కేర్‌, లాటరీలకు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు.ఆ రాష్ట్ర లకు చెందిన నేరగాళ్లు ఇతర రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్‌ సైబర్‌ నేరగాళ్లపై అక్కడి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పట్టుబడిన వారికి ఆరు నెలల వరకు బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్నారు.

దీంతో అక్కడి సైబర్‌నేరగాళ్లు స్థానికంగా కేసులు కాకుండా చూసుకుంటున్నారు. స్థానికంగా నేరాలు చేయకపోతే స్థానిక పోలీసులు తమపై దృష్టి సారించరనే భావన ఆయా ముఠాలపై ఉంది. అందుకే ఆ రాష్ట్రంలోని వారిని కాకుండా వేరే రాష్ట్రాల్లోని బడాబాబులు టార్గెట్ చేస్తున్నారు. ఎంత చదివినా కూడా వీరి వలలో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం చాలా కష్టమనే చెప్పాలి. బిహార్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌ సైబర్‌నేరగాళ్లు మాట్లాడే భాషను వెంటనే గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్లు చేసినప్పుడు ఆ విషయంపై కొద్దిగా దృష్టి పెట్టితే, వాళ్ళ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు.. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామనగానే కొందరు నమ్మేస్తున్నారు. ఇందుకు ఎక్కువగా సీనియర్‌ సిటిజన్స్‌ను ఈ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. ఏదైనా తక్కువ ధరకు వస్తుందని, లాటరీ వచ్చిందని, ఏజెన్సీలు ఇప్పిస్తామని, పెట్టుబడులు పెట్టండంటూ ఫోన్‌ చేస్తే వాటిని నమ్మొద్దు.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: