యెమెన్ మసీదులలో ఉగ్రదాడి : 142 మంది దుర్మరణం

Edari Rama Krishna

పూర్వం మనం రాక్షసుల గురించి వినే ఉంటాం. వాళ్లు విచక్షణారహితంగా మనుషుల్ని చంపేసి తినేవాళ్లు... అడవిలో అడవిమనుషులు కూడా మామూలు మనుషులు కనిపిస్తే చంపేసి తింటారు. అది వారికి మొదటి నుంచి వస్తున్న జాతి లక్షణాలు.. అనాగరికులు.. కానీ నేటి సమాజంలో మన మధ్యనే ఉంటూ అన్నీ తెలిసిన ఉగ్రవాదులు మటుకు మనుషుల్ని చంపే రోబోల్లా తయారయ్యారు.

వీరి లక్ష్యసాధన ఏమిటో తెలియదు కానీ మనుషుల్ని చంపడమే లక్ష్యంగ పెట్టుకున్నారు. తాజాగా యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ ఆధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు దాడులుచేశారు.

నలుగురు వ్యక్తులు చేసిన ఈ ఆత్మాహుతి దాడుల్లో 142 మంది మరణించగా 351 మంది గాయాలపాలయ్యారు. గతంలో కూడా ఇలాంటి దాడులు బాగా జరిగినప్పటికి ఈ సారి దాడిలో చాలా ప్రాణ నష్టం జరిగిందని అక్కడి అధికారుల అంటున్నారు.

కాగా రాజధానిలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోని మసీదులపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. హుతీలను పూర్తిగా అంతమొందించే వరకు దాడులు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: