పుర పోరు : విశాఖ మేయర్ కోసం వైసీపీ చమటోడ్చాల్సిందే...?

Satya
విశాఖ మేయర్ సీటు. అధికార వైసీపీకి కలల సింహాసనం. ముఖ్యమంత్రి సీటు ఎంత ఇంపార్టెంటో దానికి సరిసమానంగా విశాఖ మేయర్ సీటుని కూడా వైసీపీ నేతలు  తీసుకున్నారు. ఇక వైసీపీకి విశాఖ మేయర్ సీటు దక్కుతుందా అన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది. దాదాపు వంద వార్డులు ఉన్న విశాఖలో మేయర్ స్థానం సాధించలంటే మ్యాజికి ఫిగర్ 50 సీట్లు రావాలి.
కానీ చూడబోతే వైసీపీ స్కోర్ అంతకు తక్కువలోనే ఆగిపోయే విధంగా ఉందని అంటున్నారు. విశాఖలో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. దానికి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా దోహదపడింది. సరిగ్గా పోలింగ్ కి రెండు రోజుల ముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి కుండబద్ధలు కొట్టారు. అంతటితో ఆగలేదు. దీని మీద ఏపీ సర్కార్ తో ఎప్పటికపుడు చర్చలు జరుపుతున్నామని కూడా చెప్పారు. నిజానికి కేంద్ర మంత్రి చెప్పింది ప్రోటోకాల్ విషయం. అంటే పద్ధతి ప్రకాతం ప్లాంట్ లోకేట్ అయి ఉన్న రాష్ట్రంలో జస్ట్ సమాచారం చేరవేయడమే.
కానీ దానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చేసి టీడీపీ దాని అనుకూల మీడియా  చేసిన ప్రచారం వైసీపీని విశాఖలో విలన్ ని చేసి పారేసింది. అది ఎలాగంటే వైసీపీకి ఓటు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్  అయిపోవడం తధ్యమని కూడా టీడీపీ నేతలు చేసిన ప్రచారంతో జనాలు ఒక్కసారిగా టర్న్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అనుకుని  ఉన్న గాజువాకలోనే ఏకంగా 26 వార్డులు ఉన్నాయి. అంటే మొత్తం జీవీఎంసీ వార్డుల్లో ఇవి మూడవ వంతు.
ఆ విధంగా వైసీపీకి అతి పెద్ద దెబ్బ పడిపోయింది. ఇక దీని తరువాత వైసీపీ కూడా చేయడానికి కూడా ఏమీ లేదు అంటున్నారు.  ఇపుడు పోలింగ్ తరువాత సీన్ చూస్తే టీడీపీఎ వైసీపీ పోటాపోటీగా నిలబడ్డాయి. రెండింటికీ సరిసమానంగా  సీట్లు వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఏమైనా లక్ తగిలితే వైసీపీకి మేయర్ పీఠం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈజీగా గత ఏడాదితో గెలవాల్సిన వైసీపీకి ఇపుడు ఇన్ని ట్విస్టులు అడ్డుపడిపోయాయి అనుకోవాలేమో


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: