జగడ్డ : టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మరో పక్క హై టెన్షన్ ?

Chaganti
ఒకరకంగా ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో ఉత్సాహాన్ని నింపాయని చెప్పాలి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాలేదు. కొన్ని ఏరియాలలో ఉద్రిక్తతల మధ్యనే కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఫలితాలు, ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నాయని తెలుగు దేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి దశ ఎన్నికల్లో 40 % దాకా సీట్లు గెలవడంతో నేతలు అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిన్న రాత్రి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద  కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితరులు ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చి కార్యకర్తలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఇక ఈ ఉదయం కూడా పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ అమరావతిలోని తమ నివాసం నుంచి జిల్లా నేతలతో మాట్లాడారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో  టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలు ప్రకటించకుండా వైసీపీ నాయకులు అరాచకం చేస్తున్నారని అన్నారు.  కావలి రూరల్ మండలం చలంచర్లలో టీడీపీ గెలిచినప్పటికీ ప్రకటించకుండా కావలి ఎమ్మెల్యే వెళ్లి రుబాబు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.    
వెంటనే ఎస్సీలు, కలెక్టర్లు స్పందించి గెలిచిన చోట డిక్లేర్ చేయాలని నిన్న ఆయన పేర్కొన్నారు.  దాడులకు పాల్పడ్డ అధికార పార్టీ వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక ఎన్నికల ఫలితాలను  అన్ని జిల్లాల నేతలతో నేరుగా మాట్లాడుతూ నిన్నటి నుండీ చంద్రబాబు మానిటరింగ్ చేస్తునన్నారు. తొలిదశ ఫలితాల్లో అనంతపురం, చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో గట్టిపోటీ ఇవ్వగలిగామని, ఫలితాల్లో కూడా అధికార పార్టీకి చేరువలోనే నిలిచామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదిలా ఉంటే ఈ ఫలితాలు చూసి అధికార పార్టీ వాళ్ళు ఇంకెంత అరాచకం చేస్తారో అనే భయంలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: