సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

Chakravarthi Kalyan
అటు పాక్, ఇటు చైనా.. రెండు దిక్కులా శత్రు బలగాలు పొంచి ఉన్నా.. ఇండియన్ ఆర్మీ ఏమాత్రం తగ్గడం లేదు. దేశ రక్షణలో రాజీ పడేది లేదని నిరూపిస్తోంది. ఇటీవల చైనా ఇండియాపై జోరు పెంచింది. ఇటు పాక్ కూడా తనదైన పాత పద్దతిలో చొరబాట్లకు యత్నిస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ మధ్య బాగా పెరిగింది. గత ఏడాదిలో దాదాపు 40శాతం పెరిగిందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది.
అయితే ఇలాంటి చొరబాటు దారులను సైన్యం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఎప్పటికప్పుడు ఏరిపారేస్తూనే ఉంది. అలా గతేడాది నియంత్రణరేఖ వద్ద 200లకు పైగా ఉగ్రవాదులను హతమార్చింది ఇండియన్ సైన్యం. అదే సమయంలోగత ఏడాది గల్వాన్‌ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20మంది భారత్‌ సైనికులను పోగొట్టుకున్నాం. ఈ ఘటనలో చైనా తరపు నుంచి కూడా భారీగానే ప్రాణనష్టం జరిగినా.. ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారనే వివరాలను చైనా ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
అప్పటి నుంచి లడ్డాఖ్ సరిహద్దుల్లో ఇండియా చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అనేక విడతలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు చర్చలు జరుగుతున్నా.. సరిహద్దులో ఇరు దేశాలు భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. ఇటీవల ఇండియా తన సైనిక సంపత్తిని పెంచుకుంటోంది. తాజాగా  సైన్యంలో ఆయుధ సంపత్తి బలోపేతం కోసం  రూ.5వేల కోట్ల విలువైన ఆయుధాల కోసం ఒప్పందం చేసుకుంది.
తాజా భారత్‌ డ్రోన్ల తయారీలో కీలక ముందడుగు వేసింది. అదే స్వార్మ్‌ టెక్నాలజీ.. ఇదే డ్రోన్ టెక్నాలజీ.. దీని ద్వారా భారత్ తన శత్రువులపై మన భూభాగం నుంచే విరుచుకుపడొచ్చు. అలాగే ఇటీవలే భారత్ ఏకంగా 48 వేల కోట్ల రూపాయల వ్యయంతో తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఇటీవల నిర్ణయించింది. దీని ద్వారా  దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే1ఏ రకం కొనుగోలు జరుగుతుంది. ఈ ఒప్పందం కారణంగా  మరో 83 విమానాలు భారత్‌ అమ్ములపొదిలో చేరతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: